అలా చేసినా తిడుతున్నారు.. ఇలా చేసినా ట్రోల్ చేస్తున్నారు..! ఇంకా ఏం ఆశిస్తున్నారు..?

అలా చేసినా తిడుతున్నారు.. ఇలా చేసినా ట్రోల్ చేస్తున్నారు..! ఇంకా ఏం ఆశిస్తున్నారు..?

by Anudeep

Ads

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

Video Advertisement

అయితే ఈ మధ్య ఈ సీరియల్ లో సాగే విధానం పై కొందరు ట్రోల్స్ చెయ్యడం మొదలు పెట్టారు. ఆ నటీ నటులు బయట కనిపించిన ఈ సీరియల్ గురించే మాట్లాడుతూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు విషయం ఏంటంటే..
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి భర్త నందు పాతికేళ్లు కాపురం చేసి.. ఇద్దరు కొడుకులు , ఒక కూతురు పుట్టిన తరువాత లాస్య ఉచ్చులో పడతాడు. ఏకంగా ఆమెతో భార్య ముందే కాపురం పెట్టేస్తాడు. ఇక మన మంచి తులసి.. భర్త కోరుకున్నట్టే.. ప్రియురాలికి ఇచ్చి పెళ్లి చేస్తుంది.

trolls on intinti gruhalakshmi serial..
తర్వాత తులసి ఖాళీగా ఉండటంతో.. సామ్రాట్ అనే కొత్త హీరోని తీసుకుని వచ్చి ప్రేమాయణం మొదలుపెట్టించారు. అయితే సామ్రాట్.. అలియాస్ ఇంద్రనీల్ ఇప్పుడు ఎక్కడ కనిపించినా.. మీరు తులసిని పెళ్లి చేసుకుంటే మామూలుగా ఉండదు.. బాగోదు అని ప్రేక్షకులు సీరియస్ అవుతున్నారట.

trolls on intinti gruhalakshmi serial..
ఇద్దరు కొడుకులు పెళ్లిళ్లు అయ్యాక.. నాన్నమ్మ అయ్యే వయసులో పెళ్లేంటి అంటూ అని తులసిని తిట్టిపోస్తున్నారు. నందు చేసుకున్నాడు కాబట్టి.. తులసి రెండో పెళ్లి చేసుకున్నా పర్లేదు కానీ.. మరీ కొడుకుల ఏజ్‌లా కనిపిస్తున్న కుర్రహీరోతో ప్రేమాయణం ఏంటని తిట్టిపోస్తున్నారు.

trolls on intinti gruhalakshmi serial..

ఈ సీరియల్‌లో తులసి పాత్ర 50 ఏళ్లు పైపడిన గృహిణి పాత్ర. అలాంటి తులసి యంగ్ కనిపిస్తున్న సామ్రాట్‌తో లవ్, ఎఫైర్, పెళ్లి అంటూ కథనం సాగించడం ప్రేక్షకులకు మింగుడం పడటం లేదు. దీంతో వీరిద్దరి జంట అంతగా బాలేదని ప్రేక్షకులు ఇలా ఫీల్ అవుతున్నారా.. లేదా ఇంకేదైనా కారణముందా అని అని సీరియల్ మేకర్స్ చర్చించుకుంటున్నారు.

trolls on intinti gruhalakshmi serial..
సమాజం ఇంత ముందుకు వెళ్లిన కాలం లో కూడా ఒక మహిళ రెండో పెళ్లి చేసుకోవడాన్ని జనాలు ఎందుకు స్వాగతించట్లేదు అని మేకర్స్ ఫీల్ అవుతున్నారని సమాచారం. ఒకే రకం గా మూస ధోరణిలో సీరియల్స్ తీసినా జనాలకు నచ్చట్లేదు.. ఈ విధంగా తీసిన ట్రోల్స్ చేస్తున్నారు అంటూ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు.


End of Article

You may also like