Home Bigg Boss 6 telugu “పంపకపోతే చచ్చిపోతా..!” అని బెదిరించిన..? “ఫైమా” గురించి ఈ విషయం తెలుసా..?

“పంపకపోతే చచ్చిపోతా..!” అని బెదిరించిన..? “ఫైమా” గురించి ఈ విషయం తెలుసా..?

by Anudeep

పటాస్ షో ద్వారా తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ ఫామ్ లోకి వచ్చిన ఫైమా.. క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది మాత్రం జబర్దస్త్ తోనే అని చెప్పాలి. జబర్దస్త్ షోలో ఫైమ చేసిన కామెడీ టైమింగ్ అంటే ఎంతోమందికి ఇష్టం. ఆ క్రేజ్ తో నే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది .

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఫైమా తనదైన కామెడీ స్టైల్ లో జనాలు నవ్విస్తూ ..ఎంటర్టైన్ చేస్తూ ..మరోవైపు గేమ్ ఆడుతూ ఎలాగైనా సరే ఫైనల్ లోకి వెళ్లాలని ..కప్ కొట్టాలని ట్రై చేస్తుంది . కొన్ని సార్లు కామెడీ మరీ వెగటు పుట్టిస్తున్నా గానీ ఫైమా ఎంటర్టైన్ చేయడంతోనే హౌస్ లో కొనసాగుతోంది.

how faima entered into tv industry..

అయితే ఫైమా ఇండస్ట్రీలోకి రావడం చాలా అన్ ఎక్స్ పెక్టెడ్ గా జరిగిందని చెప్పుకొచ్చారు ఆమె తల్లి. ఇటీవల ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె సంచలన విషయాలు బయట పెట్టారు.
“నాకు నలుగురు ఆడపిల్లలు..అందరిలో ఫైమా చిన్నది.నేను కూలి పని చేస్తూ జీవనం సాగించేదాన్ని.. తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. నూకలు, పురుగులు పడిన బియ్యం పెట్టి పిల్లల్ని పెంచాను.

how faima entered into tv industry..

కాలేజ్ లో చదివే సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి ఫైమా పటాస్ షోకు వెళ్ళింది. ఆ షోలో ఫైమా మాట్లాడిన విధానం.. తన వాయిస్ నచ్చి ఆ షోకు మళ్లీ ఆహ్వానించారు. అయితే హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావని అక్కడికి వెళ్లవద్దని సూచించగా..పటాస్ షోకు పంపకపోతే చస్తా అని బెదిరించింది. ” అని ఫైమా తల్లి చెప్పుకొచ్చారు. బలవంతంగా ఫైమాను ఆ షోకు పంపించినా ఆ షో వల్ల మంచి పేరు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

how faima entered into tv industry..

ప్రస్తుతం ఫైమా తల్లిగా ఎక్కడికి వెళ్లినా గుర్తింపు దక్కుతోందని ఆమె కామెంట్లు చేశారు. ఫైమా చాలా టాలెంటెడ్ అని.. ఎవరిని హర్ట్ చేయదని.. అందరు తనవాళ్లు అనుకుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. తన కూతురు కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుందని నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

You may also like