Home Bigg Boss 6 telugu నేను ఓడిపోయాను అంటూ… బిగ్ బాస్ తెలుగు-6 లో ఎలిమినేషన్ తర్వాత మొదటిసారి స్పందించిన గీతూ..!

నేను ఓడిపోయాను అంటూ… బిగ్ బాస్ తెలుగు-6 లో ఎలిమినేషన్ తర్వాత మొదటిసారి స్పందించిన గీతూ..!

by Anudeep

బిగ్‌బాస్ తెలుగు 6 ఆరో వారంలో అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ కావడంతో తానే నమ్మలేకపోయింది. ఎలిమినేషన్ తర్వాత తనని ఒంటరిగా ఉండనివ్వమంటూ భావోద్వేగానికి గురైంది. బిగ్‌బాస్ వేదికపైన నాగార్జునతో కలిసి తన జర్నీని చూస్తూ ఎమోషనల్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనివ్వండి.. నేను బయటకు వెళ్లను అంటూ భోరుమని విలపించింది. గీతూను ఓదార్చేందుకు నాగార్జున ప్రయత్నించాడు. చివరకు బిగ్‌బాస్ సిబ్బందిని పిలిపించి.. బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

” నా జీవితంలో బిగ్‌బాస్ జర్నీ మోస్ట్ బ్యూటీఫుల్. నా జీవితంలో ఎన్నడూ లేని అనుభూతిని పొందాను. కానీ ఈ జర్నీలో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. దయచేసి నా తప్పులని క్షమించండి. నన్ను నన్నుగా అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసినా ప్రతీ ఒకరికి చచ్చిపోయేంత వరకు రుణపడి ఉంటాను. నా వల్ల బిగ్ బాస్ మీద చిరాకు వచ్చిన వాళ్లకు కూడా పెద్ద సారీ. ” అని గీతూ రాయల్ ఎలిమినేషన్ అనంతరం సోషల్ మీడియా లో స్పందించారు.

geethu royals posts an video after elimination

“గీతూ చాలా బాధ లో ఉంది.. తనకు కొంచెం స్పేస్ ఇవ్వండి ” అని గీతూ రాయల్ టీం పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఆమె సోషల్ మీడియా లో తన బాధను వెళ్లగక్కుకుంది. తన యూట్యూబ్ ఛానల్ లో గంట నిడివి ఉన్న ఒక వీడియో ని పంచుకుంది గీతూ. ‘ఈ రోజుల్లో నటించేవాళ్లు అందరూ మంచివాళ్లు.. అందరికీ మంచి అయిపోతున్నారు. ముఖం మీద మాట్లాడేవాళ్లు చెడ్డగా కనిపిస్తున్నారు.

geethu royals posts an video after elimination

అందుకే అన్నారేమో యదార్థవాది లోక విరోధి. నన్ను కన్న వాళ్ళకే నేను ఏంటో అర్థం కాలేదు. ఇంకా మీకు కూడా నేను అర్థం కాలేదు. నా చిన్నప్పటి నుంచి నేను నమ్మిన వల్లే నన్ను మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా నాకు అదే జరిగింది. నా సన్నిహితులని నమ్మి నేను పీఆర్ టీం లేకుండా హౌస్ లో అడుగు పెట్టా. కానీ అందరు నన్ను మోసం చేసారు.

geethu royals posts an video after elimination

అసలు నేను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అసలు అనుకోలేదు. లెక్కలు వేసుకొని గేమ్ ఆడలేదు. నేను నా లాగే గేమ్ ఆడాను. నామినేషన్స్ లో కూడా గేమ్ సరిగ్గాలేదని వాళ్లనే నామినేట్ చేశా. హౌస్ లో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా..కానీ అది బయటకి ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపించింది. ’ అని అంటూ ఆమె అందులో చెప్పుకొచ్చింది.

geethu royals posts an video after elimination

గీతూ ఆట మాత్రమే ఆడింది. ఆటను మాత్రమే పట్టించుకుంది. తన ఆట కోసం నమ్మినవారిని సైతం మోసం చేసింది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. బిగ్ బాస్ హౌస్‌లోని అందర్నీ విస్మయానికి గురిచేసింది.

geethu royals posts an video after elimination

ఇదేం ఆట బిగ్ బాస్.. నేడు ఆడిస్తా అసలు ఆట అంటూ బిగ్ బాస్‌నే డామినేట్ చేసింది. ఇక్కడే అసలు మిస్టేక్ జరిగింది. కంటెస్టెంట్స్‌ని విసిగించినంత వరకూ ఓకే.. కానీ బిగ్ బాస్ టీమ్‌ను ఆమె తేలిగ్గా తీసిపారేయడం పెద్ద మైనస్‌గా చెప్పాలి. అయితే గీతూ పోస్ట్ఈ చేసిన వీడియో కింద సైతం ఆమెను తప్పు పడుతూనే ఎక్కువమంది కామెంట్స్ చేయడం గమనార్హం. ఇప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. తన తప్పులు ఆమె తెలుసుకోవట్లేదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

You may also like