Home Bigg Boss 6 telugu ఇదే పని ఒక అబ్బాయి చేస్తే పొగిడారు..! గీతూ రాయల్ కామెంట్స్..!

ఇదే పని ఒక అబ్బాయి చేస్తే పొగిడారు..! గీతూ రాయల్ కామెంట్స్..!

by Anudeep

బిగ్‌బాస్ తెలుగు 6 ఆరో వారంలో అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ కావడంతో తానే నమ్మలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనివ్వండి.. నేను బయటకు వెళ్లను అంటూ భోరుమని విలపించింది. గీతూను ఓదార్చేందుకు నాగార్జున ప్రయత్నించాడు. చివరకు బిగ్‌బాస్ సిబ్బందిని పిలిపించి.. బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఎలిమినేట్ అయిన తర్వాత తాజగా ఆమె తన తన యూట్యూబ్ ఛానల్ లో గంట నిడివి ఉన్న ఒక వీడియో ని పంచుకుంది. ఇందులో ఆమె తన మంచి తనం గురించి, ఎవరు తనను అర్థం చేసుకోలేదంటూ మాట్లాడి తెగ ఎమోషనల్ అయిపోయింది.

geethu royal's comments on abhijeeth, kaushal manda..
ఆ వీడియో లో ఒక చోట ఆమె మాట్లాడుతూ..” గత సీజన్లలో విన్నర్ అయిన అభిజీత్ ఒక టాస్క్ లో భాగంగా ఒక ఇంటి సభ్యుడ్ని కిడ్నాప్ చేస్తే.. అబ్బో సూపర్ స్ట్రాటజీ అంటూ పొగిడేశారు. ఫాన్స్ పెరిగిపోయారు. ఫైనల్ గా విన్నర్ అయ్యాడు అభిజీత్. అలాగే మరో టాస్క్ లో అమ్మ రాజశేఖర్ దగ్గర సిగరెట్స్ తీసేసుకున్నాడు అభిజీత్. అది కూడా కరెక్ట్ అన్నారు అప్పుడు. అదే పని నేను చేస్తే మాత్రం తప్పు అని ఎలిమినేట్ చేసేసారు ఆడియన్స్.

geethu royal's comments on abhijeeth, kaushal manda..

మరో సీజన్ విన్నర్ కౌశల్ కూడా నేను కేవలం గేమ్ ఆడటానికి వచ్చాను అంటే అందరికి నచ్చింది. నేను ఒక అమ్మాయిని అయ్యుండి అదే మాట అంటే మీకు నేను హార్ట్ లేని దానిలా, పొగరు ఉన్న అమ్మాయిలా కనిపించాను. ఈ మేల్ డామినేటింగ్ సొసైటీ లో అబ్బాయిలు ఏమి చేసినా కరెక్ట్. అదే పని అమ్మాయిలు చేస్తే తప్పు.” అని అంటూ ఆమె అందులో చెప్పుకొచ్చింది.

geethu royal's comments on abhijeeth, kaushal manda..
అయితే గీతూ పోస్ట్ఈ చేసిన వీడియో కింద సైతం ఆమెను తప్పు పడుతూనే ఎక్కువమంది కామెంట్స్ చేయడం గమనార్హం. ఇప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. తన తప్పులు ఆమె తెలుసుకోవట్లేదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విమెన్ కార్డు వాడలేదు అంటుంది.. ఒక అమ్మాయి ఈ సీజన్ లో గెలవాలి.. అది నేనే అవ్వాలి అని ఆమె ఎలా మాట్లాడుతుంది అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు కౌశల్, అభిజీత్ లతో ఆమెకి పోలిక ఏంటి వాళ్ళు గేమ్ ఎలా ఆడినా మంచిగా, మానవత్వం తో ఆడారు.. వాళ్ళు ఎవరిని కించపరిచే లాగా.. మేమే గొప్ప అనేలాగా మాట్లాడి ఎవరిని బాధ పెట్టలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

You may also like