Ads
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్ర లో మోస్ట్ సక్సెసఫుల్ టీం. అది 2022 ఐపీల్ ముందు వరకు చరిత్ర. నాలుగు సార్లు ఈ ట్రోఫీ ముద్దాడిన చెన్నై జట్టు.. ఆరంభం నుంచి కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ చేతుల్లోనే ఉంది. గతేడాది ఆరంభంలో రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినా.. అతను విఫలం అవడంతో మరోసారి ధోనీ చేతికే పగ్గాలు అందించాల్సి వచ్చింది.
Video Advertisement
అయితే చెన్నై తమ జట్టు ఎప్పుడు బలంగా ఉండేలా చూసుకుంటుంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నైసూపర్ కింగ్స్ ఒకటి. తొలి ఎడిషన్ నుంచి ఎం.ఎస్.ధోనీ కెప్టెన్సీ వహిస్తూ టీమ్‌ని అగ్రపథాన నిలిపాడు. భారత జట్టుకు ఎలా విజయాలు అందించాడో.. ఐపీఎల్ లో కూడా చెన్నై జట్టుకు అలాగే ఎన్నో విజయాలు అందించాడు ధోని.
అయితే ఈ ఐపీఎల్ లో చెన్నై టీమ్ కు ఆడే డ్వెన్ బ్రేవో ని ఆటగాడిగా కొనుగోలు చేయకుండా బౌలింగ్ కోచ్ గా తీసుకున్నారు. బ్రావో లాగే ధోని తో కలిసి ఆడి.. ప్రస్తుతం పలు జట్లలో కోచ్ లుగా ఉన్న ఆటగాళ్లెవరో చూద్దాం..
#1 వసీం జాఫర్
భారత జట్టు మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు బాటింగ్ కోచ్ గా సేవలందిస్తున్నారు.
#2 ఆశిష్ నెహ్రా
టీం ఇండియా లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా.. కొత్తగా ఏర్పాటు చేసిన గుజరాత్ టైటాన్స్ కి హెడ్ కోచ్ గా ఉన్నాడు.
#3 మైక్ హస్సీ
ప్రస్తుతం ఆస్ట్రేలియా కోచ్ గా ఉన్న మైక్ హస్సి, ఐపీఎల్ లో చెన్నై తరపున పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం ఆయన చెన్నై జట్టుకు బాటింగ్ కోచ్ గా ఉన్నారు.
#4 డ్వేన్ బ్రావో
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగుల్లో రాణించిన డ్వేన్ బ్రావో.. చాలా ఏళ్లుగా చెన్నైతో కలిసి ఉన్నాడు. ఇతను కూడా వెస్టిండీస్ మాజీ కెప్టెన్. తాజాగా ఈయన్ని చెన్నై బౌలింగ్ కోచ్ గా నియమించారు.
#5 స్టీఫెన్ ఫ్లెమింగ్
స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ జాతీయ జట్టుకు కోచ్ గా ఉన్నారు. అలాగే ఆయన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్రస్తుత ప్రధాన కోచ్.
End of Article