Ads
మిగతా స్పోర్ట్స్‌తో పోలిస్తే క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. ఆసక్తికరమైనది కూడా. క్రికెట్ ఆడే విధానం, ఇందులో ఉండే రూల్స్ కూడా మిగతా స్పోర్ట్స్ కంటే భిన్నంగా ఉంటాయి. క్రికెట్లో ఆట ఒక్కటే కాదు.. ఎన్నో బయటి అంశాలు కూడా గెలుపోటములను శాసిస్తాయి.
Video Advertisement
నిజానికి ఈ ఆట పుట్టింది ఇంగ్లాండ్ లోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన ఇండియాలో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించి ఒక మతంలా మారింది. అయితే ఈ క్రికెట్ పుట్టినప్పుడు దానితో పాటు కొన్ని లాస్ అంటే ఈ ఆటను ఎలా ఆడాలో కొన్ని రూల్స్ ను రూపొందించారు. వాటినే మనం లాస్ ఆఫ్ క్రికెట్ అంటాం.
ఇలా క్రికెట్ ఆడేందుకు ఎన్నో నియమాలు ఉంటాయి. వాటిల్లో ఒకటే ఒకే బౌలర్ రెండు వరుస ఓవర్లు వెయ్యకూడదు అని. ఇది క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక ఓవర్ లో 6 బాల్స్ వేస్తారు. అలాగే ఈ ఆరు లీగల్ డెలివెరీస్ అయితేనే ఓవర్ కంప్లీట్ అవుతుంది. అంటే వైడ్ బాల్, నో బాల్ మరియు డెడ్ బాల్ ను కౌంట్ లోకి తీసుకోకుండా బాల్స్ ను కాలుక్యులేట్ చేస్తారు.
ఇక ఒక ఓవర్ ను ఒక బౌలింగ్ ఎండ్ నుండి వేస్తే మరో ఓవర్ ను ఇంకో బౌలింగ్ ఎండ్ నుండి వెయ్యాలి. ఏ బౌలర్ ను కూడా వరుసగా రెండు ఓవర్లు పాటు బౌలింగ్ వేసేందుకు అనుమతించారు. అయితే ఒక ఓవర్ వేస్తున్నప్పుడు బౌలర్ గాయపడిన లేదా సస్పెండ్ అయినా వేరే బౌలర్ వచ్చి ఆ మిగతా బాల్స్ వేసి ఓవర్ ను కంప్లీట్ చెయ్యవచ్చు.
కానీ ఆ ఓవర్ ముగిసాక నెక్స్ట్ ఓవర్ మాత్రం అతను కంటిన్యూ చెయ్యడానికి ఉండదు. వేరే కొత్త బౌలర్ వెయ్యాలి. ఆట తీరు మార్చడానికి ఈ నిబంధన తీసుకొచ్చారు.అయితే వరసగా రెండు ఓవర్లు ఒకే బౌలర్ ఏ పరిస్థితుల్లో వేయచ్చు అంటే.. టెస్ట్ మ్యాచుల్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్.. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లో బౌలింగ్ వెయ్యొచ్చు.
అంతే కాకుండా పలానా బౌలర్ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్నాడనో, మరో బౌలర్ ఆ గ్రౌండ్‌లోని మరో పేరుతో ఉన్న ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్నాడని చూపిస్తారు. నిజానికి ప్రతి ఓవర్ పూర్తయిన తర్వాత వికెట్ కీపర్ పిచ్‌కు ఓ వైపు నుంచి మరోవైపుకు మారుతాడు. బౌలర్లు పిచ్‌కు రెండు వైపుల నుంచి బౌలింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొచ్చారు. ఒకేవల ఒక బౌలర్ ఒక ఓవర్ వేసిన తర్వాత…నెక్స్ట్ ఓవర్ వేరే బౌలర్ వేసేటప్పుడు…కొన్ని బౌల్స్ వేసాక ఇంజురీ అయితే..ఓవర్ లో మిగిలిన బౌల్స్ బౌలింగ్ కిందటి ఓవర్ బౌలింగ్ వేసిన బౌలర్ వేయచ్చు.
Also read: “ధోనీ లాగానే వేరే వాళ్ళు ప్రవర్తిస్తే ఊరుకుంటారా..?” అంటూ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
End of Article