“అంబటి రాయుడుకి అన్యాయం చేశారు..!” అంటూ… అనిల్ కుంబ్లే కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“అంబటి రాయుడుకి అన్యాయం చేశారు..!” అంటూ… అనిల్ కుంబ్లే కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Anudeep

Ads

ఐపీఎల్ 2023 విజేత చెన్నై సూపర్‌కింగ్స్ ఫైనల్ హీరో అంబటి రాయుడు ఆ మ్యాచ్‌తో మరోసారి చర్చల్లోకొచ్చాడు. తక్కువ స్కోరే అయినా ధాటిగా ఆడి జట్టు విజయానికి దోహదపడ్డాడు. అది కూడా తన చిట్ట చివరి ఆటలో. ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ కు కూడా రాయుడు గుడ్ బై చెప్పాడు.

Video Advertisement

అయితే రాయుడికి ఉన్న ప్రతిభకి టీమిండియాలో వచ్చిన అవకాశాలకు అసలు పొంతనే లేదు. కెరీర్ తొలినాళ్లలో సచిన్ అంతటివాడు అవుతాడని అనుకున్నా.. తాను వేసిన తప్పటడుగులతో రాయుడుకి తగిన గుర్తింపు రాలేదు. ముఖ్యంగా టీమిండియాలో చోటు విషయంపై అంబటికి బీసీసీఐ అన్యాయం చేసిందని తాజాగా అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు.

kumble comments about ambati rayudu..!!

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ధాటిగా ఆడటంలో అంబటి రాయుడు ప్రత్యేకం. జట్టుకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా చేయత అందిస్తుంంటాడు. 2018-19 మధ్యకాలంలో టీమ్ ఇండియాలో వచ్చిన అంబటి రాయుడు అద్భుతంగా రాణించాడు. నాలుగవ స్థానంలో బరిలో దిగినా జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడాడు.

kumble comments about ambati rayudu..!!

ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్‌లో రాయుడు ఆడతాడని అందరూ భావించారు. కానీ బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ పెద్ద షాక్‌ వచ్చింది. 2019 వన్డే ప్రపంచకప్‌కు రాయుడును కాదని ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు. దీంతో నిరాశ చెందిన రాయుడు బీసీసీఐపై బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. అయితే ఆటపై మక్కువతో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియాలో మళ్లీ చోటు దక్కలేదు.

kumble comments about ambati rayudu..!!

ఇప్పుడు ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే స్పందించాడు. ‘రాయుడు 2019 ప్రపంచకప్‌ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాయుడిని తప్పించి సెలక్షన్‌ కమిటీతో పాటు జట్టు మెనేజ్‌మెంట్‌ పెద్ద తప్పు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి అతడిని నాలుగో స్థానం కోసం ఆరునెలల పాటు సిద్ధం చేశారు. కానీ ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది’ అని కుంబ్లే షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.ప్రస్తుతం కుంబ్లే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also read: అప్పుడు “షేన్ వార్న్”… ఇప్పుడు “ధోనీ”..! ఇలాంటి ఘనత వీరికే సాధ్యం ఏమో..!


End of Article

You may also like