ధోనీ ఆడిన గేమ్‌కి 30 లక్షల డౌన్‌లోడ్స్..! ఇంతకీ అది ఏంటంటే..?

ధోనీ ఆడిన గేమ్‌కి 30 లక్షల డౌన్‌లోడ్స్..! ఇంతకీ అది ఏంటంటే..?

by kavitha

Ads

టీంఇండియాకి 3 ఐసీసీ ట్రోఫీలు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకి 5 టైటిల్స్ సాధించిన మాజీ కెప్టెన్, క్రికెటర్ ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు.

Video Advertisement

ధోనీ భారత జట్టుకు దూరమైనా అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ధోనీకి సంబంధించిన విషయలు చిన్నవైనా కూడా  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ధోనీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ, ట్యాబ్‌లో ఒక గేమ్ ఆడుతున్న వీడియో ఒకటి క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ms-dhoniఆ వీడియోలో ధోనీ ఫ్లైట్‌లో కూర్చొని ట్యాబ్‌లో గేమ్ ఆడుతుంటే, ఒక ఎయిర్ హోస్టెస్ ధోనికి చాక్లెట్‌ని ఇచ్చింది. ధోనీ ఆమెను పలకరించి, మాట్లాడుతూ ఆ చాక్లెట్స్ తీసుకుంటాడు. ఇక ఆ సమయంలో ధోనీ ట్యాబ్‌లో ఆడుతున్న గేమ్  క్యాండీ క్రష్ అనేది వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది.
ధోనీ క్యాండీ క్రష్ ఆడటంతో ధోనీ ఫ్యాన్స్ తో సహా క్రీడాభిమానులలో ఇంట్రెస్ట్ ను కలిగించింది. ట్విట్టర్‌లో #Candycrush ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో పై నెటిజన్లు, ధోని ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘క్యాండీక్రష్ డౌన్‌లోడ్  ఇప్పుడు చేయాలనిపిస్తుంది’ అని ఒకరు, ‘ధోని దెబ్బతో  క్యాండీక్రష్ డౌన్‌లోడ్స్ పెరుగుతాయి’ అని మరొకరు, ‘ధోని క్యాండిక్రష్‌లో ఏ లెవెల్‌లో ఉన్నాడో’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోతో  కొన్ని గంటల్లోనే క్యాండీ క్రష్ గేమ్‌ డౌన్‌లోడ్స్ బాగా పెరిగాయి.
స్వయంగా క్యాండీ క్రష్ ఈ విషయాన్ని తమ అఫిషియల్ పేజీలో వెల్లడించింది. క్యాండీ క్రష్ మేనేజ్‌మెంట్ తమ గేమ్ ఆడుతున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది.  అనంతరం  3 గంటల్లో 30 లక్షలకు  పైగా క్యాండీ క్రష్ గేమ్ ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లుగా తెలిపింది. మహేంద్ర సింగ్ ధోనీ గేమ్ ఆడుతూ ఇలా కనిపించడం మొదటిసారి కాదు. గ్రౌండ్ లో క్రికెట్ ఆడే ధోనీ, మైదానం బయట ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతూ కనిపిస్తాడు. ధోనీ పబ్‌జీ, ఫిఫా, కాల్ ఆఫ్ డ్యూటీ ఎక్కువగా ఆడుతూ ఎంజాయ్ చేస్తాడు.

Also Read: కెప్టెన్ కూల్ “ధోని” ఇరుక్కున్న 5 కాంట్రవర్సిలు ఏంటో తెలుసా.? 5 వ ది చాలామందికి తెలియకపోవచ్చు.!


End of Article

You may also like