Ads
టీం ఇండియా క్రికెటర్లలో నిరంతరం సోషల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేసేవారిలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ తదితరులు ఎక్కువగా ఉంటారు. కానీ తాజాగా ఇండియన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చేసిన పనికి సోషల్ మీడియా షేక్ అవుతుంది.
Video Advertisement
అయితే ఉత్తర ప్రదేశ్ కు చెంది భువీ 2012 లో టీం ఇండియా తరపున అరంగ్రేటం చేశాడు. తన బౌలింగ్ తో ఎంతో మంది ఆదరణ పొందాడు. టీం గెలుపు తనవంతు కృషి చేస్తూనే రికార్డులు క్రియేట్ చేశాడు. కానీ గత కొంత కాలంగా భువీకి బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి.
అయితే 33 ఏళ్లు ఉన్న భువీ లాస్ట్ ఇయర్ నవంబర్ లో చివరి సారిగా ఆడాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ -2022, టీ20 ప్రపంచకప్ – 2022లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఈ కారణం చేత భువీని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ళ జాబితా నుండి బీసీసీఐ తొలగించింది. ఇదిలా ఉంటే ఈ సంఘటన తర్వాత భువీ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ కీలక మార్పు చేశారు. అంతకముందు తన బాయోలో ఇండియన్ క్రికెటర్ అని పెట్టుకున్న భువీ… దీని తర్వాత ఇండియన్ గా మార్చారు.
దీంతో భువీ అభిమానులు, ఫాలోవర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్లీజ్ భువీ రిటైర్మెంట్ లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఆటలో అనేక పరిస్థితులు ఉంటాయి అన్నీ ఒకేలా ఉండవు వాటిని మనసులో పెట్టుకుని నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోకు అంటూ భువీకి పోస్ట్ లు చేస్తున్నారు. నువ్వు చాలా బాధ పడ్డావని తెలుస్తుంది భువీ కానీ ఇవన్నీ కామన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మొత్తంగా భువీ చేసిన చిన్న మార్పు అభిమానులను టెన్షన్ పెడుతోంది. అయితే ట్విట్టర్ లో మాత్రం ఇండియన్ క్రికెటర్ అని అలానే ఉంచడం గమనార్హం.
End of Article