ధోనీ, కోహ్లిలతో ఆడే ఈ ప్లేయర్ కి 100 కోట్ల ఆస్తి ఉందా..? క్రికెట్ వైపు ఎలా వచ్చాడంటే..?

ధోనీ, కోహ్లిలతో ఆడే ఈ ప్లేయర్ కి 100 కోట్ల ఆస్తి ఉందా..? క్రికెట్ వైపు ఎలా వచ్చాడంటే..?

by Anudeep

Ads

ఇండియన్ క్రికెటర్లలో ప్రాధన్యత సంతరించుకున్న స్పిన్నర్ గా అశ్విన్ నిలిచాడు. మరి ఇంత పేరు తెచ్చుకున్న అశ్విన్ బ్యాగ్ గ్రౌండ్ ఎంటో తెలియాలంటే అసలు కథలోకి వెళ్ళాలి.

Video Advertisement

అయితే అశ్విన్ క్రికెటర్ అవ్వడానికంటే ముందు ఇంజినీరింగ్ చదివాడట. చిన్నప్పటి నుండి క్రికెట్ పైన మక్కువ ఉన్నప్పటికీ చదువును అశ్రద్ధ చేయకుండా… పద్మ శేషాద్రి బాల భవన్, సెయింట్ బీడ్స్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలల్లో సెకండరీ విద్యను పూర్తి చేసి… చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో బీటెక్ కంప్లీట్ చేశారు.

this player has 100 crores property

ఇక క్రికెట్ పై ప్రేమతో అశ్విన్ స్కూళ్ళో ఉన్నప్పటి నుండే సీకే విజయ్ , చంద్ర ప్రోత్సాహంతో క్రికెట్ లో రాణించాడు. అక్కడి నుండి అశు వెనక్కి తిరిగి చూస్కొలేదు. ఇప్పటికే ఈ ఏడాది వేలంలో రాజస్థాన్ రాయల్స్ అశూ ను 5 కోట్ల రూపాయలకు కొనగా…. ఈ సీజన్ లో ఆడిన 13 ఇన్నింగ్స్ లో 14 వికెట్ల పడగొట్టాడు. అంతే కాకుండా తదుపరి టెస్టు సిరీస్ లో వెస్టిండీస్ తో ఆడిన రెండు మ్యాచుల్లో 15 వికెట్లు తీసి అదరగొట్టారు.ఇలా టీం ఇండియా తరపున బెస్ట్ స్పిన్నర్ గా నిలిచి తిరుగులేని ఆటగడయ్యాడు అశు.

ఇదిలా ఉంటే బీసీసీఐ కాత్రక్ట్ లిస్ట్ లో అశ్విన్ ఏ గ్రేడ్ లో ఉన్నందున ఏటా 5 కోట్ల రూపాయలు, మరోవైపు ఐపీఎల్ లో భారీ పారితోషికం పుచ్చుకుంటూ కోట్ల రూపాయలకు అధిపతి అవుతున్నాడు. అలా చూసుకుంటే సుమారు నికర ఆస్తి విలువ 100 కోట్ల దాకా ఉండే అవకాశం ఉందని పలు క్రీడా ప్రావిన్యులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ లో అశ్విన్ ఇప్పటి వరకు 712 వికెట్లు పడగొట్టగా… భారత జట్టులో ప్రత్యేక స్థానం సంపాదించి షేక్ ఆడిస్తున్నాడు.


End of Article

You may also like