కప్ గెలిచాక కూడా ఆస్ట్రేలియా మీడియా భారత్ మీద ఇంత ఈర్ష్య ఎందుకు పడుతున్నారు..?

కప్ గెలిచాక కూడా ఆస్ట్రేలియా మీడియా భారత్ మీద ఇంత ఈర్ష్య ఎందుకు పడుతున్నారు..?

by Mounika Singaluri

Ads

2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నెగ్గిన తర్వాత ఆ దేశ మీడియా ఆస్ట్రేలియా టీంను పొగడ్తలతో ముంచెత్తింది. భారత్ ను ఓడించి ఆరోసారి ఆస్ట్రేలియా కప్ నెగ్గడం పైన ఆ టీం ప్లేయర్లను అందరూ అభినందిస్తున్నారు. ఆస్ట్రేలియాను ఒంటి చేతితో నెగ్గించిన ట్రావిస్ హెడ్ ని అయితే ఛాంపియన్ అంటూ కీర్తిస్తున్నారు.

Video Advertisement

ఫైనల్ మ్యాచ్ కి ముందు రోజు మీడియా కాన్ఫరెన్స్ లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ… స్టేడియంలో ఉన్న లక్ష 30 వేల మందిని నిశ్శబ్దంలోకి నెట్టేయడమే మా లక్ష్యం అని అన్నాడు. ఫైనల్ రోజు అదే చేసి చూపించాడు.’


ఆదివారం అహ్మదాబాద్ స్టేడియంలో భారత అభిమానులందరూ నిశ్శబ్దంలో ఉండిపోయారు. ఈ పని చేసి చూపించిన కెప్టెన్ ను ఆస్ట్రేలియా మీడియా ప్రశంసలతో ముంచేస్తుంది. భారత్ నుండి ప్రపంచ కప్పును ఆస్ట్రేలియా ఎలా చేజక్కించుకున్నారు అంటూ ఆస్ట్రేలియా పత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ కథనం రాసింది. సాంకేతికంగా అరో సారి భారత్ ను ఓడించి కప్ గెలిచింది అని, చాలా రకాలుగా ఈ కప్ భారత్ కు దక్కి ఉండేది అని అంది.ప్రపంచ కప్పులో క్రీడా స్ఫూర్తి చూపు లేదంటూ భారతీయులను విమర్శిస్తూ ది క్రానికల్ పత్రిక హెడ్ లైన్ పెట్టింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రోఫీతో సంబరాలు జరుపుకుంటుంటే, భారత్ ఆటగాళ్లు అనాగరికంగా ప్రవర్తించారని అంది.ఆస్ట్రేలియా ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో భారత్ జట్టు ఎక్కడ కనిపించలేదు అని చెప్పుకొచ్చింది.

హెరల్డ్ సన్ పత్రిక అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కి పాంటింగ్ మాటలను ప్రచురించింది.పిచ్ భారత్ కి బ్యాక్ ఫైర్ అయింది అని రాసింది. పిచ్ తాను అనుకున్న దానికంటే స్లోగా ఉందని, స్పిన్ బాగా తక్కువ అయింది అని, బౌలర్లు పిచ్ కు తగ్గట్టు బౌలింగ్ చేశారని చెప్పారు.దాన్నే ఆ పత్రిక రాసింది.భారత్ తో మ్యాచ్ గెలవడం పీక్స్ అని అన్న ఆస్ట్రేలియన్ కెప్టెన్ కమిన్స్ మాటలను ది సండే మార్నింగ్ హెరాల్డ్ ప్రచురించింది. భారత జట్టుపై గెలవడం ఆస్ట్రేలియా టీం కి మంచి సంతోషాన్ని కలిగించింది అని అంది.విరాట్ కోహ్లీ వికెట్ తీసి ఆస్ట్రేలియాను ఆ టీం కెప్టెన్ కమిన్స్ విజయ తీరాల వైపు నడిపించాడని ది ఏజ్ పత్రిక రాసింది.ఆస్ట్రేలియా మీడియా కథనాలు చూసిన భారతీయులు ఎందుకు భారత్ అంటే అంత అసూయ అని మండిపడుతున్నారు.

 

Also Read:పేరుకి ఏమో నంబర్ 1 బ్యాట్స్‌మెన్… కానీ నీకంటే గల్లీ క్రికెటర్లు బాగా ఆడతారు ఏమో..!


End of Article

You may also like