Ads
తెలంగాణ రాష్ట్రంకు చెందిన అరవెల్లి అవనీష్ రావు అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ జట్టుకు ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యాడు. అవనీష్ రావు సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ గ్రామానికి చెందిన యువకుడు. అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ కు తమ జిల్లాకు చెందిన అవనీష్ రావు ఎంపికవడంతో సిరిసిల్ల జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Video Advertisement
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా అవనీష్ రావుకి అభినందనలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అవనీష్ రావు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే అండర్ – 19 పురుషుల వన్డే వరల్డ్ కప్ లో ఆడబోయే టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బపోటీ పడనుంది. ఈ జట్టుకు అండర్ – 19 ఆసియాకప్ కెప్టెన్ గా కొనసాగుతున్న ఉదయ్ సహరన్ వరల్డ్ కప్‌లో కూడా కెప్టెన్సీ అప్పజెప్పింది. పదిహేనుమంది ఆటగాళ్లతో కూడిన ఈ టీమ్ లో అండర్ – 19 ఆసియాకప్ ప్లేయర్స్ కే అవకాశం ఇచ్చారు. అర్షిన్ కులకర్ణి, రుద్ర మయూర్ పటేల్, ఆదర్శ సింగ్, సచిన్ దాస్ బ్యాటింగ్ చేయనున్నారు. ఇక జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన అరవెల్లి అవనీష్ రావును వికెట్ కీపర్‌గా సెలెక్ట్ అయ్యాడు. అవనీష్ రావు తెలంగాణలోని సిరిసిల్లా జిల్లా, పోత్గల్ గ్రామానికి చెందిన క్రికెటర్. అతను వెలమ వర్గానికి చెందినవాడు. పోత్గల్, దాని చుట్టుపక్కల గ్రామాలలో అధిక శాతం ఆ వర్గానికి చెందినవారు ఉంటారు. అయితే ఆ వర్గం వారిలో ఎక్కువగా రాజకీయ, లేదా వ్యాపార రంగాల వైపుకు వెళ్తారనే టాక్ ఉంది.కానీ అవనీష్ రావుకు చిన్నప్పటి నుండి క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. క్రికెట్ లో ప్రతిభ కనపరిచిన అవనీష్ ను అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. సిరిసిల్ల వంటి ప్రాంతం నుంచి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంతో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అవనీష్ తల్లిదండ్రుల పైన నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: సౌత్ ఆఫ్రికా తో మూడో టి20… హైదరాబాదీ ఆటగాడు పై వేటు…!
End of Article