SHOIB MALIK FIRST WIFE: షోయబ్ మాలిక్ మొదటి భార్య ఎవరు..? టెలిఫోన్ లో పెళ్లి జరగడం ఏంటి..?

SHOIB MALIK FIRST WIFE: షోయబ్ మాలిక్ మొదటి భార్య ఎవరు..? టెలిఫోన్ లో పెళ్లి జరగడం ఏంటి..?

by Harika

Ads

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్స్ సానియా మీర్జా, ప్రముఖ క్రికెట్ షోయబ్ మాలిక్ విడిపోయారు అని బహిరంగంగా ప్రకటించకపోయినా కూడా, కొన్ని రోజుల క్రితం షోయబ్ మాలిక్ తాను మరొక పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించి ఆ ఫోటోలని విడుదల చేశారు.

Video Advertisement

దాంతో ఆ వార్తలకు బలం చేకూరింది. గత కొంత కాలం నుండి సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కలిసి ఉండట్లేదు అనే వార్త ప్రచారంలో ఉంది. సానియా మీర్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొటేషన్స్ కూడా ఆలోచింపచేసేలాగా ఉంటున్నాయి.

కానీ అలాంటిది ఏమైనా ఉంటే ప్రకటిస్తారు కదా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు షోయబ్ మాలిక్, సనా జావేద్ అనే నటిని పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్ కి ఇది మూడవ పెళ్లి. షోయబ్ మాలిక్ పంజాబ్ లోని సియాల్కోట్ లో ఒక పంజాబీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. షోయబ్ మాలిక్ తండ్రి మాలిక్ ఫకీర్ హుస్సేన్ అక్కడే ఉన్న ఒక చెప్పుల షాప్ లో పనిచేసేవారు.

2006 లో త్రోట్ క్యాన్సర్ తో ఆయన మరణించారు. షోయబ్ మాలిక్ 2002 లో అయిషా సిద్ధికి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. 8 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 2010 లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఏప్రిల్ 7 వ తారీఖున వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటే. ఏప్రిల్ 12 వ తారీఖున షోయబ్ మాలిక్ సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నారు.

అప్పట్లో ఈ విషయం ఎంతో చర్చలకి దారి తీసింది. పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అంటూ సానియా మీర్జా ఇంటి ఎదురుకుండా కొంత మంది ఆందోళన చేశారు. కానీ వీటన్నిటి మధ్య వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. సానియా మీర్జా సెలబ్రిటీ కాబట్టి తను మనందరికీ తెలుసు. కానీ షోయబ్ మాలిక్ మొదటి భార్య అయిన అయిషా సిద్ధికి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు.

who is shoaib malik first wife

వారు విడిపోయే సమయానికి అయిషాకి 29 సంవత్సరాలు. అయిషా కూడా హైదరాబాద్ కి చెందినవారు. వీరిద్దరు పెళ్లి మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఒకానొక సందర్భంలో షోయబ్ మాలిక్ ఈ విషయం మీద మాట్లాడుతూ, వాళ్ళిద్దరూ టెలిఫోన్లో పెళ్లి చేసుకున్నారు అని, అసలు ముఖాముఖిగా కలవలేదు అని చెప్పారు. ఫోటోలు మాత్రం మార్చుకున్నారు అని అన్నారు.

who is shoaib malik first wife

2002 లో జూన్ లో తన ఫ్రెండ్ షాప్ కి వెళ్లి, అయిషాకి అక్కడి నుండి కాల్ చేశారు అని, ఫోటోలో ఉన్న అమ్మాయిని తాను పెళ్లి చేసుకుంటున్నాను అని అనుకొని, నికాహ్ నామా మీద తన సంతకం పెట్టాను అని చెప్పారు. సానియా మీర్జాతో పెళ్లికి కొన్ని రోజుల ముందు మాత్రమే ఈ విషయం బయటికి వచ్చింది. అప్పుడు అయిషా, షోయబ్ మాలిక్ తనని పెళ్లి చేసుకున్నారు అని వీడియో ఆధారాలు కూడా చూపించారు. కానీ ఇప్పుడు అయిషా ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

ALSO READ : 90’స్ సిరీస్ లో నటించిన వాసంతిక… సలార్ సినిమాలో ఉందా..? ఎక్కడో గుర్తుపట్టారా..?


End of Article

You may also like