Home Sports Adda అసలు ఎవరీ జయ భరద్వాజ్..? దీపక్ ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్..?

అసలు ఎవరీ జయ భరద్వాజ్..? దీపక్ ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్..?

by Anudeep

జయ భరద్వాజ్.. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ పేరుని తెగ వెతికేస్తున్నారట. నిన్న మ్యాచ్ తర్వాత CSK జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగియగానే చోటు చేసుకున్న ఈ సంఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె పేరే జయ భరద్వాజ్.. జయ కూడా ఎస్ చెప్పడంతో చాహర్ ఆనందానికి అంతే లేదు.

jaya bharadwaj 1

ఈ సీన్ తరువాత అందరు జయ భరద్వాజ్ గురించి ఇంటర్నెట్ లో వెతకడం ప్రారంభించారు. చూడడానికి ఫారినర్ లా కనిపించే జయ భరద్వాజ్ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ చెల్లెలు. ఆమె భారతీయురాలు. నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్నారు. ఫైనల్స్ కి కూడా చేరుకున్నారు. వీడియో జాకీగా కూడా ఆయన పని చేసారు. జయ భరద్వాజ్ ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉండి సేవలు అందిస్తున్నారు.

jaya bharadwaj 2

ఆమె దీపక్ చాహర్ కి ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లే తెలుస్తోంది. ఇటీవలే దీపక్ తోటి క్రికెటర్లకు కూడా ఆమెను పరిచయం చేసాడట. మ్యాచ్ ముగిసిన తరువాత ఉన్నట్లుండి తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయడంతో ఫస్ట్ అందరు షాక్ అయ్యారు. ఆ తరువాత చప్పట్లతో అభినందించారు. కామెంటర్లు సైతం వీరు బాగుండాలి అంటూ మైక్ లో అనౌన్స్ చేసారు. ఈ వీడియోను తన అభిమానులతో పంచుకున్న దీపక్.. ఇది తన జీవితంలో అత్యంత మధురమైన సంఘటన అని పేర్కొన్నాడు.

You may also like