అత్తయ్య టికెట్ తీస్తే హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు…చివరికి ఆ జంట జైలు పాలవ్వాల్సి వచ్చింది..! అసలేమైంది.?

అత్తయ్య టికెట్ తీస్తే హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు…చివరికి ఆ జంట జైలు పాలవ్వాల్సి వచ్చింది..! అసలేమైంది.?

by Mohana Priya

Ads

గత సంవత్సరం జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వారి తప్పు లేకుండానే ఒక జంట ఒక కేసులో ఇరుక్కున్నారు. దాని వల్ల జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియా టైమ్స్ కథనం ప్రకారం, ఒనిబా, షరీక్ భార్య భర్తలు. గత సంవత్సరం ఒనిబా తన మొదటి బిడ్డతో ప్రెగ్నెంట్ గా ఉన్నారు. వాళ్ళ బంధువు ఒకరు ఒనిబా, షరీక్ కి ఖతార్‌ కు హనీమూన్ టికెట్లను బహుమతిగా ఇచ్చారు.

Video Advertisement

జూలై 6వ తేదీ, 2019 లో ఒనిబా, షరీక్ ముంబై నుండి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అప్పుడే కొంత మంది అధికారులు వచ్చి వారిద్దరిని జైలుకు తరలించారు. ఒక ఇన్స్పెక్షన్ లో వాళ్ల లగేజ్ లో నాలుగు కిలోల మత్తు పదార్థం ఉన్నట్టు వెల్లడైంది. ఆ పదార్థాన్ని వాళ్ల ట్రిప్ ని స్పాన్సర్ చేసిన బంధువు వీరిద్దరికీ అప్పగించారు. ఆ బంధువు పేరు తబస్సుమ్. తబస్సుమ్ చెప్పిన దాని ప్రకారం అందులో పొగాకు ఉంది, అది దోహా లోని తన స్నేహితులకు అప్పగించాలి.

దాంతో ఒనిబా,షరీక్‌ లకు 10 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు, అక్రమంగా మాదకద్రవ్యాలు రవాణా చేసినందుకు కోటి రూపాయల జరిమానా విధించారు. ముంబై పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఒక ఏడాది పాటు జరిపిన దర్యాప్తులో ఒనిబా,షరీక్ లని తబస్సుమ్ ఎలా మోసం చేశారో తేలింది.

గత సెప్టెంబర్ లో ముంబై పోలీసులు తబస్సుమ్ మరియు ఆమె సహచరుడు నిజాం కారాను అరెస్ట్ చేసి, వారి దగ్గర నుండి 13 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌సిబి వీరిద్దరిని ప్రశ్నించింది అని, వీళ్లిద్దరు మిడిల్ ఈస్ట్ లోని అక్రమ రవాణాదారులతో సంబంధాలున్న డ్రగ్ పెడ్లర్స్ అని తేలిందని ఎన్‌సిబి అధికారి ఒకరు చెప్పారు.

ఇప్పుడు ఈ సాక్ష్యాధారాలతో వాళ్ళిద్దరినీ (ఒనిబా,షరీక్) విడుదల చేయాలి అని ఎన్‌సిబి, దౌత్య మార్గాల (డిప్లోమేటిక్ ఛానల్స్) ద్వారా ఖతార్ ‌ను సంప్రదించనున్నారు. ఒనిబా,షరీక్ లతోపాటు వాళ్ళ కుటుంబం కూడా మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒనిబా తల్లి ఇండియన్ ఎంబసీ కి ఎన్నో ఉత్తరాలు రాశారు.

ఒనిబా మామయ్య ఆరు నెలలు దోహాలో గడిపారు. అక్కడ ఈ కేసును వాదించడానికి లాయర్ నియమించడం కోసం, అలాగే ఖరీదు ఎక్కువ కాని హోటల్స్ లోనే ఒక హోటల్ నుండి మరొక హోటల్ కి మారాల్సి రావడంలో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి.

దీనిపై ఒనిబా తల్లి ప్రవీణ్ కౌసర్ మాట్లాడుతూ ” నా బిడ్డ ఒక ఫారిన్ కంట్రీ లో ఒంటరిగా జన్మనిచ్చింది. మేము ఇప్పటి వరకు మా మనవరాలిని చూడలేదు. ఖతార్ అధికారులు వాళ్లని ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.

source : INDIATV

జైలు అధికారులు ఒనిబాతో వారానికి రెండు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి ప్రవీణ్ కౌసర్ కి అనుమతి ఇచ్చారు. ఒనిబా కుమార్తెను జైలు ప్రాంగణంలో ఉన్న క్రచ్ ‌లో ఉంచారు. తన బాధ్యతలను అందులో ఉన్న ఒక నర్స్ చూసుకున్నారు. వీరిద్దరిని దోషులుగా తేల్చిన తర్వాత, ఓనీబా తండ్రి షకీల్ అహ్మద్ 2019 సెప్టెంబర్ 27వ తేదీన ఎన్‌సిబి డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్థానా కి లెటర్ రాశారు. దాంతో ఈ కేసుపై ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది.

ఈ లెటర్ లో “తబస్సుం రియాజ్ ఖురేషి, ఇంకా తన అసోసియేట్ అయినా నజీం కారా ద్వారా తన కుమార్తె మరియు అల్లుడు హనీమూన్ ప్యాకేజ్ విషయంలో మోసం చేయబడ్డారు. ఒక ఎన్‌సిబి దర్యాప్తులో ఒక డ్రగ్ నెట్‌వర్క్ ద్వారా ఈ జంట ట్రాప్ చేయబడ్డారు” అని పేర్కొన్నారు. ఈ జంటను తిరిగి తీసుకురావడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దౌత్య మార్గాల ద్వారా ఖతార్ లోని అధికారులను సంప్రదించినట్లు ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా తెలిపారు.

ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం యొక్క కష్టం ఫలించింది. ఈ సంవత్సరం జనవరిలో వారి పది సంవత్సరాలు జైలు శిక్ష ని రద్దు చేస్తూ ఖతార్ యొక్క హైయెస్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. జైలునుండి విడుదల అయిన తర్వాత వారిద్దరూ భారతదేశానికి చేరుకొని తర్వాత ముంబైలోని వారి కూతుర్ని కలుసుకున్నారు.


End of Article

You may also like