Ads
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. సౌరవ్ భార్య, డ్యాన్సర్ డోనా గంగూలీ మరియు సోదరుడు స్నేహాశిష్ గంగూలీ ఈ విందులో పాల్గొన్నారు. అయితే వీరు వ్యక్తిగతంగానే కలుసుకున్నారు. ఈ విందు సందర్భంగా వారు తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Video Advertisement
ఈ ఫొటోలో కేంద్ర మంత్రి అమిత్ షా, గంగూలీ తో పాటు పలువురు భోజనం చేస్తూ ఉన్నారు. అయితే.. ఈ ఫోటోనే నెట్టింట్లో వివాదానికి కారణం అయ్యింది. ఈ ఫోటోపై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.
మగవాళ్లంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే, ఇంట్లోని ఆడవాళ్లు వాళ్లకి భోజనం వడ్డించడం ఈ ఫొటోలో కనిపిస్తుంది. దీనితో ఇది పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ మాత్రమే కాదు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఫోటోపై తమ వంతు స్పందన చూపిస్తూ వచ్చారు.
ఇంత చదువుకుని, లైఫ్ లో సెటిల్ అయ్యి, ధనవంతులు అయి ఉండి కూడా స్త్రీలను ద్వేషించడం మానుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నాం.. ఒక సీటు ఖాళి గా ఉన్నా సరే ఆ ఇంటి ఇల్లాలు నిలబడే సేవ చేయాలా? అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న డోనా గంగూలీ (సౌరవ్ గంగూలీ భార్య) ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే ఉండాల్సి వస్తోంది.. ఎంత ఘనత తెచ్చుకున్నా, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా స్త్రీకి ఇచ్చే గౌరవం ఇంతేనా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Educated. Born rich. High on society ranks. You can have all of it but still fail miserably to hide the generational misogyny. Even with a seat left empty, the house of the wife must stand and serve. #Sanskari #Indian #HouseParty 😅 https://t.co/anHjERxqdH
— Lady Lestrange (@LadyLestrange2) May 7, 2022
End of Article