హోటల్ బాయ్ కి టిప్ లేక ఆ పేపర్ ఇచ్చారు…ఇప్పుడు అది 100 కోట్లు.! అందులో “ఐన్స్టీన్” ఏం రాసారు అంటే.?

హోటల్ బాయ్ కి టిప్ లేక ఆ పేపర్ ఇచ్చారు…ఇప్పుడు అది 100 కోట్లు.! అందులో “ఐన్స్టీన్” ఏం రాసారు అంటే.?

by Mohana Priya

Ads

మహానుభావులు ఏ విషయం చెప్పినా కూడా గొప్పగానే అనిపిస్తుంది. వారు చెప్పే చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో పెద్ద అర్థం దాగి ఉంటుంది. సాధారణంగా అయితే, ఇలా గొప్పవారిగా పేరు పొందిన వారందరూ ఎక్కువగా మాట్లాడరు అని అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. అలా చాలా తక్కువ మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి మాట్లాడినప్పుడు చాలా కరెక్ట్ గా మాట్లాడతారు.

Video Advertisement

Albert Einstein's note to a bell boy

ఇందాక పైన చెప్పినట్టుగా, వారు మాట్లాడే ప్రతి విషయంలోనూ ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. ఇందుకు ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన ఒక ఉదాహరణ. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వ్యక్తి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే 1922 లో ఐన్స్టీన్ ఒకసారి చైనా కి వెళ్లారు.

Albert Einstein's note to a bell boy

ఆ హోటల్ బెల్ బాయ్ ఐన్స్టీన్ కి ఒక సందేశం అందించారు. అయితే ఐన్స్టీన్ దగ్గర టిప్ గా ఇవ్వడానికి డబ్బులు లేవు. అప్పుడు ఐన్స్టీన్ “థియరీ ఆఫ్ హ్యాపీనెస్” పేరుతో ఒక నోట్ రాసి ఇచ్చారు. అందులో ఐన్స్టీన్ “ఎప్పుడు సక్సెస్ కావాలనుకునేవారు, అలాగే దాని కోసం విశ్రాంతి లేకుండా పరిగెత్తే వారి జీవితం కంటే, ప్రశాంతమైన జీవితం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది” అని రాశారు.

Albert Einstein's note to a bell boy

అంటే “ప్రశాంతమైన మనసు, ప్రశాంతమైన మెదడు ఒక మనిషి ఆనందంగా ఉండడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి” అని దీని అర్థం. ఈ నోట్ 1.5 మిలియన్ లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు అర్థమైందా? గొప్ప వారు మాట్లాడే ప్రతి విషయం చాలా గొప్పగా ఉంటుంది అని.


End of Article

You may also like