Ads
బిగ్ బాస్ అభిమానులను కోసం సీజన్ 6 ను ఆదివారం గ్రాండ్ గా లాంచ్ చేశారు స్టార్ మా నిర్వాహకులు. ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇంత మందిని ఒకేసారి హౌస్ లోకి పంపడం ఏంటని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Video Advertisement
మొదటి రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత.. అంత మందిని ఇంట్లోకి పంపి వారికి కావాల్సిన సౌకర్యాలు బిగ్ బాస్ నిర్వాహకులు కల్పించలేదని ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు. అయితే గత సీజన్ల లాగే హౌస్ లోకి ఎక్కువ యూట్యూబర్ లు, మోడల్స్, చిన్న సెలెబ్రెటీలను తీసుకు రావడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తక్కువ పారితోషికానికి ఒప్పుకుంటారని వీరిని ఇంట్లోకి పంపారంటూ నెటిజన్ల నుంచి కామెంట్ లు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి లో ఆకట్టుకొనే కంటెస్టెంట్లను ఎంపిక చేయడం మానేశారంటూ బిగ్ బాస్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులకు తెలియని ముఖాలే హౌస్ లో ఎక్కువగా ఉన్నాయంటూ వారు వాపోతున్నారు.
స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీలకు బిగ్ బాస్ నిర్వాహకులు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. షో పై ఆసక్తిని పెంచేందుకు గాను తొలి రోజు నుంచే హౌస్ లో గొడవలకు ఆజ్యం పోశారు నిర్వాహకులు. వీరిలో టైటిల్ రేసులో ఎవరుంటారనే చర్చ ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతోంది.
మరోవైపు సామాన్యులకు ఛాన్స్ ఇస్తామని ప్రచారం చేసి బిగ్ బాస్ నిర్వాహకులు ఒక విధంగా చీట్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ ఆది రెడ్డిని కామన్ మాన్ కోట లో హౌస్ లోకి పంపడం సబబు కాదంటున్నారు ప్రేక్షకులు. స్టార్ మా యాడ్ ను నమ్మి అనేక మంది ఆడిషన్లు ఇవ్వగా, ప్రజలను చీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియోను కూడా తాజాగా డిలీట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత సీజన్లను మించి బిగ్ బాస్ సీజన్6 సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
End of Article