పెళ్లి జరిగిన తరువాత వధూవరులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచడం కోసం శోభనం అనే కార్యక్రమాన్ని జరుపుతారు. ఇందుకు కూడా మంచి ముహుర్తాన్ని ఎంపిక చేసుకుని.. శుభ సమయంలో వధూవరులను ఒక గదిలోకి పంపిస్తారు. అయితే.. ఆ సమయంలో గదిని కూడా అందంగా అలంకరిస్తారు. అది వారి ఇద్దరికీ కలిసి మొదటి రాత్రి కాబట్టే ఆ సమయాన్ని మెమరబుల్ గా మార్చడం కోసం గదిని అందంగా అలంకరిస్తారు.
మనం సినిమాల్లో గమనించినా కూడా.. బెడ్ పైన ఎర్రని గులాబీలతో అందంగా అలంకరిస్తారు. ఇదంతా ఆర్భాటం కోసం అనుకుంటే పొరపాటే. దీని వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
గులాబీ రంగుని ప్రేమకి చిహ్నంగా భావిస్తారు. అందుకే గులాబీలను కూడా ప్రేమకు సంకేతంగా అందిస్తూ ఉంటారు. గులాబీ రంగు కానీ, గులాబీ పూల సువాసన కానీ శారీరక కోరికలను కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెంచడంలో ఇవి ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అందుకే వధూవరుల మధ్య కూడా అలాంటి అనుబంధం పెరగాలి అన్న ఉద్దేశ్యంతోనే వారిద్దరిని కలిపే తొలి రాత్రి రోజు గదిలో ఇలా గులాబీలతో అలంకరిస్తూ ఉంటారు.
అంతేకాక గులాబీలతో అలంకరించడం వలన గదికి ఎక్కడ లేని అందం వస్తుంది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే మనసంతా తేలిక పడి పులకిస్తుంది. ఇటువంటి అనుభూతిని వధూవరులకు అందించడం కోసమే వీటితో అలంకరిస్తుంటారు. గులాబీల స్పర్శ కొత్తగా పెళ్లి అయిన జంట జీవితాన్ని ప్రేమతో నింపుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే తొలి రోజు వధూవరులు నిద్రించే గదిని గులాబీలతో అలంకరిస్తారు. వీటి వెనుక ఇంత అర్ధాలు ఉండబట్టే.. పూర్వీకుల కాలం నుంచే శోభనం అనే కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా నిర్వర్తించేవారు. కొత్తగా పెళ్లి అయిన వధూవరులను ఆశీర్వదించి గదిలోకి పంపించేవారు. వారి బంధం ప్రేమకు చిహ్నంగా, పవిత్రంగా ఉండాలని దీవించేవారు.
























నేషనల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నా శ్రీదేవిని అప్పటిలో వివాహం చేసుకోవడానికి ఎంతో మంది తారలు, నిర్మాతలు క్యూ కట్టారు. కానీ శ్రీదేవి చివరికి బాలీవుడ్ నిర్మాత అయినా బోనికపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. దినికి ముందు శ్రీదేవి పెళ్లి విషయంలో కొందరు హీరోల పేరులు వినిపించాయి. మరి ఆ స్టార్స్ ఎవరో చూద్దాం రండి.
మురళీమోహన్ 19వ శతాబ్దిలో ఒక స్టార్ హీరో. అప్పటిలో మురళీమోహన్ తో శ్రీదేవికి పెళ్లి అని ఒక పుకార్లు ప్రచారం అయింది. అప్పుడే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మురళీమోహన్ శ్రీదేవితో పెళ్లికి నిరాకరించటం జరిగిందట.
స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో యాంగ్రీ యంగ్ మాన్ శేఖర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని స్వయంగా ఆమె తల్లి కోరిందట. అప్పటిలో కెరియర్ పరంగా బిజీగా ఉన్న రాజశేఖర్ శ్రీదేవితో వివాహానికి నో చెప్పానని తెలిపారు.
ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీదేవి మిధున్ చక్రవర్తి ప్రేమలో పడింది. వీరిద్దరూ కొంతకాలం సీక్రెట్ గా సహజీవనం కూడా చేశారట. అప్పటికీ పెళ్లయిన మిథున్ చక్రవర్తి మొదటి భార్యను వదిలేస్తేగాని శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లి చెప్పడంతో, మిధున్ చక్రవర్తి తన మొదటి భార్యను చేసుకున్న తర్వాత తనకు కలిసి వచ్చిందని చెప్పి శ్రీదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట.
చివరకు బోనీ కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది శ్రీదేవి. వీరిద్దరి వివాహానికి ముందే శ్రీదేవి గర్భవతి కావడం వలన వీరి పెళ్లి హడావిడిగా జరిగిపోయింది అని అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
