ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా షర్మిల ఎంగేజ్మెంట్ కు హాజరైన తన అన్న సీఎం జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
అన్న జగన్ పట్టించుకోని, షర్మిల జగన్ రాజకీయ ప్రత్యర్ధి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం చెప్పడం, ఆదరించిన తీరుతో ఇద్దరి మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు. ఇది ఇలా ఉంటే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో సీఎం జగన్, భారతి పూజలు చేయగా, భారతి పూజారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను అవమానపరిచిందంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు ఆఫీస్ లో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇద్దరు తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సీఎం జగన్ పంచెకట్టుతో, భుజంమీద కండువాతో కనిపించారు. తన సతీమణి భారతితో కలిసి పూజలు చేశారు. గోమాతకు పూజ కూడా చేశారు. ఆ తరువాత భోగి మంటను వెలిగించారు. అయితే పూజలు పూర్తయిన తరువాత పూజారులు ఇచ్చిన తీర్ధ, ప్రసాదాలు ఇచ్చారు.
అయితే కొందరు వైఎస్ భారతి తీర్థాన్ని ఒంపేసిందని, ప్రసాదాన్ని పొట్లం కట్టిందంటూ విమర్శిస్తూ కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే ఆమెకు తీర్ధం ఇవ్వగా, తీసుకుంది. ఆ తరువాత తల పై రాసుకుంది. ఇలా అందరు సాధారణంగా చేస్తారు.
తీర్థాన్నికిందపడానివ్వకుండా తలకు రాసుకోవడం అనేది ఎప్పటి నుండో ఉన్న విషయమే. ఆ విధంగానే ఆమె చేసింది. ఇక ప్రసాదాన్ని తీసుకున్న తరువాత పక్కన ఉన్నావారెవరో టిష్యూ ఇవ్వగా, దానితో తన చేతిని తుడుచుకుంది. ప్రసాదాన్ని పొట్లం కట్టడం కానీ పడేయడం కానీ చేయలేదు. ఇదంతా కావాలని చేస్తున్న ప్రచారం అని అంటున్నారు.
watch video :
Also Read: రాజారెడ్డి ఎంగేజ్మెంట్లో షర్మిల తన అన్నని పట్టించుకోలేదా..? విభేదాలు నిజమేనా..?

వైఎస్ షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను గత పది రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలిసి అందచేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే షర్మిల అందరికన్నా ముందుగా ఆహ్వాన పత్రికను తన అన్న జగన్ కు అందచేశారు. కానీ దానికి సంబంధించిన ఫోటో లేదా వీడియో ఎక్కడా కనిపించలేదు. అటు వైసీపీ కానీ ఇటు షర్మిల కానీ వాటిని రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా నిశ్చితార్థంకు జగన్ హాజరైన ఫోటోలు, వీడియోలు సీఎంఓ ప్రతినిధులే రిలీజ్ చేశారు. ఇందుకు కారణం ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా షర్మిల అవడమే అంటున్నారు.
ఇక కొడుకు నిశ్చితార్థంకు ఆహ్వానించిన షర్మిల, వైఎస్ జగన్, భారతిలను పట్టించుకోలేదని, జగన్ వచ్చి, వెళ్లేంత వరకు అన్నా చెల్లెళ్ళు అంతగా కలవలేదని టాక్. ఫోటో దిగడం కోసం స్వయంగా జగన్ పిలిచినా షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ పట్టించుకోలేదు. దాంతో జగన్, భారతి బొకే ఇచ్చి వెంటనే వేడుక నుండి వెళ్లిపోయారు. ఇదంతా చూసినవారు జగన్ కలవాలని చూసినా షర్మిలే దూరంగా ఉంటున్నారని అక్కడికి వచ్చినవారు అంటున్నారు. జగన్ తన చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమె అన్న వైపు చూడలేదని ఇతర అతిథులు అంటున్నారు.
అయితే ఇదే వేడుకకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నంత సమయం ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్నతో ఫోటోకు దూరంగా ఉన్న షర్మిల, బ్రదర్ అనిల్, పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో దిగడం. రాజకీయంగా జగన్ శత్రువు అయిన పవన్ కళ్యాణ్ కు షర్మిల ఇంతటి ఆదరం చూపడంతో అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు పెరిగిపోయాయని అంటున్నారు.
జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమయం కోసం యావత్ దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. సుమారు 150 -200 కిలోల బరువున్న రాముడి విగ్రహాన్ని తాజాగా ఊరేగింపుతో రామ మందిరానికి తీసుకువచ్చారు. ఈ విగ్రహాన్ని మైసూర్ కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ భాగ్యం తమకు దక్కినందుకు యోగిరాజ్ కుటుంబం సంతోష పడుతున్నారు.
ఈ క్రమంలో అరుణ్ యోగిరాజ్ భార్య విజేత తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె భర్త విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అతని కంటికి గాయం అయిన విషయాన్ని వెల్లడించింది. రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కే పనిని అరుణ్ యోగిరాజ్కి అప్పగించినప్పుడు, విగ్రహానికి అనువైన రాయి మైసూరు సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. అయితే అతను రాయి కోసం సైట్ ను సందర్శించినప్పుడు ఆ రాయి చాలా గట్టిగా ఉంది. విగ్రహాన్ని చెక్కుతున్న క్రమంలో ఒక పెచ్చు యోగిరాజ్ కంటికి గుచ్చుకుంది. దానిని తొలగించడానికి కంటి ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది.
విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ, దానిని భరిస్తూనే విగ్రహం చెక్కడాన్ని కొనసాగించాడని చెప్పుకొచ్చారు. చివరికి ఆయన కృషి, అంకితభావం, పనితనం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పుణ్యకార్యానని అప్పగించినందుకు తమ కుటుంబం ఆనందంలో మునిగిపోయిందని వెల్లడించింది.








