తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. 6 గ్యారంటీలు అమలులో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్లకు టిఎస్ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ అవకాశంను కల్పించారు.
అయితే ఈ పథకం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు చాలా ఉపయోగకరమని, ఈ పథకం ద్వారా స్త్రీలకు ఆర్థిక తోడ్పాటు కలుగుతుందని అంటున్నారు. ఆటో డ్రైవర్లు తమ బతుకు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వం పై భారం పెరిగి, డాన్ని భారతి చేయడానికి తిరిగి ప్రజల నుండే రకరకాల పన్నుల పేరుతో తిరిగి వసూలు చేస్తారని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకంలో భాగంగా మహిళలు తెలంగాణలో ఏ మూల నుండి నుండి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం పల్లె వెలుగు బస్సులలో, సిటీఆర్డీనరీ మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ పధకాన్ని డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మొదటి వారం ఎలాంటి కార్డు లేకున్నా ఉచిత ప్రయాణించే సౌకర్యం ఉండగా, ఆ తర్వాత నుండి టీఎస్ఆర్టీసీ మహిళలకు జీరో టికెట్లు జారీ చేసింది. ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదొ ఒకటి కండక్టర్‌కు చూపించాలి.ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది.
గతంలో పన్నెండు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ఈ పథకం తరువాత దాదాపుగా 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ ఎవరికి ఉండాలో వారికే ఉండాలి. పేయింగ్ కెపాసిటీ ఉండి నెలకు పది వేలు సంపాదిస్తూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే, నా దృష్టిలో వారు బిచ్చమెత్తుకున్నట్లే” అంటూ వెంకటరమణా కామెంట్స్ చేశారు.
https://www.instagram.com/reel/C1_sMETplmK/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: ఆ పోస్టర్ ని స్వయంగా తానే కారుకి అంటించుకున్న “సీఎం రేవంత్”.. ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముందంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జనవరి 22న జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, వీవీఐపీలు, అయోధ్యకు చేరుకోనున్నారు. ఇకపై అయోధ్య రామాలయం హిందూవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కానుంది. ఇక ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా 7 వేల కేజీల హల్వాను ప్రసాదంగా తయారు చేయనున్నారు. ఈ ప్రసాద తయారిని విష్ణు మనోహర్ దక్కించుకున్నారు. ఆయనెవరో కాదు దేశంలోనే ప్రముఖ చెఫ్. ఇప్పటికే విష్ణు మనోహర్ వంటలలో 12 వరల్డ్ రికార్డ్స్ ను సాధించారు.
విష్ణు మనోహర్ 1968లో ఫిబ్రవరి 18 నాగ్ పూర్ లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కుకింగ్ షో యాంకర్ మరియు చెఫ్. విష్ణు మనోహర్‌కి నాగ్‌పూర్, పూణే, ఔరంగాబాద్, ఇండోర్, థానే మరియు కళ్యాణ్ నగరాల్లో రసోయ్ పేరుతో చైన్ రెస్టారెంట్ ఉంది. 53 గంటల పాటు వంట చేసి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక చెఫ్. 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ‘పొడవైన పరాటా’ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 3 గంటల్లో 7000 కిలోల మహా మిసల్‌ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక చెఫ్ మనోహర్.
2018 డిసెంబర్ 20న భారతదేశంలో 3200 కిలోల వంకాయలతో వంట చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3000 కిలోల కిచిడీని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తరువాత ఒక కుండలో 5000 కిలోల కిచిడి చేసిన తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఎన్నో వంటల పుస్తకాలను కూడా రాశారు. తాజాగా 285 నిమిషాలలో అన్నంతో పాటు 75 రకాల డిషెస్ ను తయారు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు రామ మందిర ప్రసాదంను తయారు చేసే బాధ్యతను విష్ణు మనోహర్ తీసుకున్నారు. 7000 కిలోల హల్వాను తయారు చేయడం కోసం 1400 కేజీల భారీ కడాయిని నాగ్ పూర్ నుండి అయోధ్యకు తెప్పించారు. ఈ ప్రసాదాన్ని 1.5 లక్షల భక్తులకు పంచిపెట్టనున్నారు.
ఆదిత్య హాసన్ తెరకెక్కించిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అప్పటి తరం పిల్లలు, తల్లి తండ్రులు, 90లలోని పరిస్థితులను, ఎమోషన్స్, ఆకట్టుకునే డైలాగ్స్ తో పాటు మ్యూజిక్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ 120 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఐఎండిబిలో 9.6 రేటింగ్ పొందింది. శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి, వసంతిక, రోహన్ రాయ్ నటించారు.
శివాజీ కూతురు దివ్య పాత్రలో వసంతిక మచ్చ నటించింది. ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సిరీస్ కన్నా ముందు ఆమె పలు చిత్రాలలో బాలనటిగా నటించి, మెప్పించింది. 90స్ సిరీస్ తో పాపులర్ అవడంతో వసంతిక నటించిన మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాని హీరోగా నటించిన ఓ సినిమాలో వసంతిక బాలనటిగా కనిపించింది.
నాని, మెహ్రీన్ పిర్జాద జంటగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ మూవీ 2016 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వసంతిక బాలనటిగా కనిపించింది. నాని, వసంతిక ఉన్న సీన్ మరియు 90స్ లోని సీన్ కలిపి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ‘ఓరిని ఈ పాప అప్పుడే పెద్దది అయిపోయిందా’ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.












గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ నటించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. 2005 లో మళయాళంలో రిలీజ్ అయిన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2008 లో ఆలయం మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తరువాత వర్షం సాక్షిగా లో నటించినా గుర్తింపు రాలేదు. ఆ తరువాత తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.
2022 లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ తో ఆమెకు మంచి ఫేమ్ లభించింది. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం ఎక్కువగా రాలేదు.సినీ అవకాశాలు ఎలా ఉన్నా, హనీ రోజ్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్. ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి హాజరు అయిన హనీ రోజ్ న్యూ లుక్ లో వెరైటీగా కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూ హెయిర్ స్టైల్, ఆరంజ్ కలర్ డ్రెస్‌లో అచ్చం హాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్ కనిపించారు. ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించు కుందని కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. హనీ రోజ్ ప్రస్తుతం మళయాళంలో ‘తేరీ మేరీ’ తెలుగులో ‘గాలి బ్రదర్స్’ సినిమాలలో నటిస్తున్నారు.
ప్రేక్షకులకు కూడా ఈ టీజర్ బాగా నచ్చి రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఆరాట పడిపోతున్నారు. చిత్ర బృందం కూడా త్వరలోనే ఈ చిత్రం వెండి తెర మీదకు వస్తుంది అని సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పుడు జయం రవి ఫాన్స్ కు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతుందట. అది కూడా ఈ జనవరి 26న డైరెక్ట్ గా జి5 లోకి ఈ చిత్రం విడుదల కానుంది అని తెలిసిన వెంటనే ఫాన్స్ అందరూ నిరాశ పడుతున్నారు.
రవి బస్రూర్ తన అసలు పేరు కాదని, తన గతాన్ని, ఎక్కడి నుండి వచ్చాడో ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కన్నడ సరిగమప షోలో పాల్గొన్న రవి బస్రూర్, తన గతాన్ని, పేరు ఎందుకు మార్చుకున్నారో వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తినడానికి కూడా ఏం దొరికేది కాదని, అప్పుడు తన జేబులో ఒక చిట్టీ మాత్రం ఉండేదని, ఏ రోజు, ఏ గుళ్లో ప్రసాదం ఏం పెడతారో అందులో రాసి పెట్టుకునేవారట.
ఆ చిట్టి ప్రకారం ఆ దేవాలయానికి వెళ్లి ప్రసాదం తింటూ తన కడుపు నింపుకునేవారట. అలాంటి సమయంలో కామత్ అనే పెద్దాయన ఆయనను బెంగళూరులోని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడట. ఇత్తడి, బంగారు వస్తువుల తయారీ వంటి పనులు చేస్తాడని చెప్పాడట. అయితే ఇతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పని చేస్తుంటాడాని చెప్పి, పనిలోకి తీసకోమని చెప్పాడంట, అయిత పని ఇచ్చిన వ్యక్తి గిటార్ కొనుక్కోవడానికి రూ. 35 వేలు ఇచ్చాడట. అది చూసి ఇద్దరు షాక్ అయ్యారట. పరిచయమే కూడా లేని వ్యక్తి అంత డబ్బు ఇవ్వడమేంటని షాక్ అయ్యారట.
అంతేకాకుండా ఫ్యూచర్ లో మంచి సంగీత దర్శకుడు అవుతాడని చెప్పాడు. ఇక ఇతన్ని కలవాలంటే ఐదు నెలలు అపాయింట్ మెంట్ తీసుకుంటారని అన్నాడట. అయితే అలాంటివాటిని తాను నమ్మనని రవి బస్రూర్ అన్నాడట. కానీ ఆ తరువాత ఆ వ్యక్తి చెప్పిందే జరిగింది. తనకు సాయం చేసిన ఆ వ్యక్తికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయన పేరు రవి. గౌరవం ఆయనకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి పేరుని, తన గ్రామం పేరుతో కలిపి పెట్టుకున్నారట. అలా కిరణ్ నుండి రవి బస్రూర్ గా మారానని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.