మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి మిస్టర్ బచ్చన్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తోంది.
అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుండి రవితేజకి జంటగా సీనియర్ హీరోయిన్లను సెలెక్ట్ చేస్తున్నారని, ముంబై, కన్నడ నుంచి కొత్త హీరోయిన్ తీసుకొస్తున్నారంటు రకరకాలుగా ప్రచారం సాగింది. ఫైనల్ గా ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకున్నారు. ఆమె నటించిన క్యాడ్ బరీ యాడ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
రవితేజ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. భాగ్యశ్రీ చీరకట్టులో ఉన్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఆకట్టుకొనేలా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
భాగ్యశ్రీ బోర్సే పూణెకు చెందిన నటి, మోడల్. 33 ఏళ్ళ భాగ్యశ్రీ మోడల్ గా రాణిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలో లాగోస్ లో చదువుకుంది. ఇండియా తిరిగి వచ్చిన తరువాత బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ టైమ్ లో మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఒక ఎజెన్సీతో పనిచేసింది. అలా పలు బ్రాండ్లకు భాగ్యశ్రీ అంబాసిడర్ గా పని చేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో భాగ్యశ్రీ పాపులర్ అయ్యింది.
రీసెంట్ గా ‘యారియాన్ 2’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్యలక్ష్మిగా తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. యారియన్ 2 మూవీలో భాగ్యశ్రీ బోర్సే నటన చూసి, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా నుండి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: 2023 లో ఎంట్రీ ఇచ్చిన 7 హీరోయిన్స్ .. ఎవరు హిట్టు..ఎవరు ఫట్టు.?

ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సి జంటగా నటించిన సినిమా డంకీ. ఈ మూవీలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్లు ఈ మూవీ పై ఆసక్తిని రేకెత్తించాయి. షారుక్ హీరోగా నటించడం, రాజ్ కుమార్ హిరానీ లాంటి దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీ డిసెంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో డంకీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.
ట్రైలర్ తో మూవీ పై ఆసక్తి ని క్రియేట్ చేసిన, రాజ్ కుమార్ హిరానీ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేక పోయాడంటూ టాక్. ప్రధమార్ధం చెత్తగా ఉందని, ఇక ద్వితీయార్ధం ఎమోషనల్ సీన్స్ తో నెట్టుకొచ్చారట. కొన్ని సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ కదిలిస్తాయని, మిగతాది బోర్ ఫీల్ అయ్యేలా ఉందట. హిరానీ ఎప్పటిలానే ఈ చిత్రంతో కూడా సందేశం ఇచ్చాడట.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుండి సంజు వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా విషయంలో తడబడ్డట్టు సమాచారం. మరో వైపు డంకీ మూవీ పై బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీలో బలమైన హిం-స, లైం-గి-క బెదిరింపులు, భయానక, ఆ-త్మ-హ-త్య, అడల్ట్ కామెడీ మరియు డ్రగ్స్ వంటి అంశాలు ఉన్నాయని షాకింగ్ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం అయ్యింది. ఈ వేలంలో 214 మంది భారతీయ ఆటగాళ్లు, 119 విదేశీ ఆటగాళ్లతో కూడిన మొత్తం 333 మంది ఆటగాళ్లు 77 స్లాట్ల కోసం పోటీపడ్డారు. అయితే దుబాయ్ లో నిర్వహించిన ఈ వేలంకు మల్లికా సాగర్ నిర్వాహకురాలుగా వ్యవహరించారు. అయితే ఐపీఎల్ వేలం నిర్వాహకురాలుగా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి.
మల్లికా సాగర్‌కు వేలం నిర్వహించడంలో చాలా అనుభవం ఉంది. గతంలో ఆమె మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వాహకురాలుగా వ్యవహరించింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2003, 2024 సీజన్లతో పాటుగా, ఆమె కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఆక్షన్స్ కూడా నిర్వహించారు. ఆమె వేలం నిర్వహించిన తీరు పై పెద్ద ఎత్తున్న ప్రశంసలు వచ్చాయి. దాంతో ఆమెను ఐపీఎల్ వేలంకు సెలక్ట్ చేశారు.
ఆమె ముంబైకి చెందిన వ్యక్తి. ఆమె ఆర్ట్ హిస్టరీ స్టడీస్ ను ఫిలడెల్ఫియాలో బ్రైన్ మావర్ కళాశాలలో పూర్తి చేసింది. 2001లో 26 సంవత్సరాల వయసులో వేలం సంస్థ క్రిస్టీస్‌లో మల్లిక కెరీర్‌ను మొదలుపెట్టింది. క్రిస్టీస్ లో మల్లికా సాగర్ తొలి ఇండియన్ ఆక్షనీర్ గుర్తింపు పొందింది. మల్లికా తన 22 ఏళ్ళ అనుభవంలో అనేక వేలంలు నిర్వహించింది. సమకాలీన భారతీయ ఆర్ట్ వేలంను నిర్వహించిన మొదటి వ్యక్తి మల్లికనే. క్రికెట్ వేలం గురించి ఆక్షనర్ హ్యూ ఎడ్మీడ్స్ వేలం వీడియోలు చూసి నేర్చుకున్నట్లుగా మల్లికా సాగర్ తెలిపారు.








