భారత రాజ్యాంగం లోని 164వ ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రులను గవర్నర్ అపాయింట్ చేస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు 10 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. దేశానికి ప్రధాన మంత్రి ఎలాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగా.
రాజ్యాంగ బద్ద పదవులు ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవ వేతనాన్ని అందుకుంటారు దేశ ప్రధాని దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులు. అయితే దేశ రాష్ట్రపతికి నెలకి 5 లక్షల రూపాయల గౌరవ వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు అందించబడతాయి.

అలాగే 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జీతాలు అందించబడతాయి. అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా జీతాలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత జీతాలు అందుకుంటారు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి నెలకి 3,35,000 రూపాయల జీతం అందుతుంది.

అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 4,10,000 రూపాయల జీతం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కువ జీతం అందుకుంటున్నారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో పోలిస్తే కూడా ముఖ్యమంత్రి కి ఎక్కువ జీతం అందుతుం

పాకిస్థాన్ లోని అహ్మద్‌పూర్ సియాల్‌లోని సీతా రామాలయం గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శతాబ్దానికి పైగా నిర్మించబడిన ఈ ఆలయం ఆ ప్రాంతంలో నివసించే హిందువులకి ప్రార్థనా స్థలంగా ఉంది. ఈ ఆలయం క్లిష్టమైన చెక్కడాలు మరియు పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన అద్భుతమైన వాస్తుశిల్పం, మతపరమైన సరిహద్దులను చెరిపివేసి గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క కథను తెలియచేస్తుంది. సీతా రామ మందిరం అహ్మద్‌పూర్ సియాల్‌లో మత వైవిధ్యానికి చిహ్నంగా ఉంది.
అయితే ఆలాంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాప్‌గా మర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాలను విముక్తి చేయాలి. లేకపోతే వారు భారతదేశం యొక్క మరొక వైపు చూస్తారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “పాకిస్తాన్లో మైనారిటీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సీతా రామ మందిరం బయట చికెన్ షాప్ తెరవడం. అటువంటి పాపాలు చేసి ఈ వ్యక్తులు ఎంతగా దిగజారిపోతారు?” అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఈ సంఘటన పై అంతర్జాతీయ సంఘాలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సమూహాల మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ సంఘటన దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని ప్రతిబింబించెలా ఉండడంతో, ఇలాంటి సంఘటనల పై ఆ దేశ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.



ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన కేసులో దావూద్ ఇబ్రహీం మరియు అతని సన్నిహితులపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం దేశంలోని పవర్ ఫుల్ లీడర్లను, వ్యాపారులను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాడనే సమాచారం ఎన్ఐఏకు అందింది. దాంతో ఎన్ఐఏ విచారణలో భాగంగా దావూద్ ఇబ్రహీం హసీనా పార్కర్ సోదరుడు అలీషా పార్కర్ ను విచారించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే, రెండవ పెళ్లి చేసుకున్నట్టుగా తెలిపినట్టుగా ఒక వార్తా సంస్థ వెల్లడించింది.
దావూద్ ఇబ్రహీం మొదటి భార్య పేరు జుబీనా జరీన్. ఆమె 1960లో ముంబైలో జన్మించారు. ఆమెకు మరో పేరు కూడా ఉంది. అదే మెహజబీన్ షేక్. 1990వ దశకంలో, జుబీనా జరీన్ దావూద్ ఇబ్రహీంను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఫోటోలు పబ్లిక్ డొమైన్ లో ఎక్కువగా లేవు. వీరి పెద్ద కుమార్తె మహర్ఖ్ ఇబ్రహీం, 2006 లో జావేద్ మియాందాద్ కుమారుడు అయిన జునైద్ మియాందాద్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక పాప ఉంది.
జుబీనా జరీన్ రెండవ కుమార్తె, మెహ్రీన్ 2011లో పాకిస్థానీ-అమెరికన్ అయిన అయూబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి మూడవ సంతానంగా 2012లో మరియా ఇబ్రహీం జన్మించారు. నివేదికల ప్రకారం జుబీనా 2017లో ముంబైకి వెళ్లి అక్కడ తన తండ్రి సలీం కాశ్మీరీని చూసింది. అయితే ఆమె తల్లి మరియు సోదరులు మరియు సోదరీమణుల గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.



డీఎస్పీ నళిని తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమం చేసేవారి పై లాఠీ ఎత్తలేను అంటూ తన ఉద్యోగాన్ని వదిలేసింది. మేర వర్గానికి చెందిన నళినికి వివాహం జరిగి, అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఢిల్లీలో సైతం దీక్షలు చేసింది. రాజీనామా చేసిన తరువాత ఆమె కనిపించలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో నళినిని తిరిగి జాబ్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ సామజిక మధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యోగానికి రిజైన్ చేసిన నళినికి డీఎస్పీ పోస్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే విధులకి తీసుకోవాలని సీ.ఎస్ మరియు డీజీపీలను ఆదేశించారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి.
తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ర్ట దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్ లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హై లైట్ చేశారు. ఆ నాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది.
ఉద్యమములో నేను నిర్వహించిన కీలక మైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది.కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. ఏకాంతవాసం అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు,కుటుంబం,ఆరోగ్యం,మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను.జీవచ్చవం లా బతికాను. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు.వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను.
అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలోజీ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు.నా వాణి లో మాధుర్యం నింపి నన్ను ఆచార్య ను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎ గా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు.నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు.కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా పై కరుణ చూపి స్టేటస్ కో కు అనుమతించండి.
నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి.మీలో మంచి స్పార్క్ ఉంది.మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ , సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.
( నేను మిమ్మల్ని కలవాలి. కాని ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీ గా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి.సమయం ఎక్కువగా లేదు.అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ లోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్ లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది)” అంటూ రాసుకొచ్చారు.