ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. టెక్నాలజీని వాడుకుని సినిమా శైలిని మార్చేశారు. రాంగోపాల్ వర్మ సినిమాలు, ఆయన పెట్టే ఫ్రేమ్ లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
అయితే రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యురీకం చేసి ఎంతోమంది డైరెక్టర్లు అయ్యారు. వారిలో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ తదితరులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.

అయితే రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసిన అజయ్ భూపతి ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత మహాసముద్రం సినిమా తీసిన అది అంతగా ఆడలేదు. ఇప్పుడు మూడో సినిమాగా మంగళవారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన గురువు రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాలు తనకు నచ్చవని కానీ ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని అన్నారు.

వర్మ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తారు గాని, నిజానికి ఆయన వ్యక్తిత్వం అది కాదని, అది బాగా దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఆయనలో ఉన్న ఒరిజినల్ ఫిలిం మేకర్ బయటకు వస్తే ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా వర్మ ఉంటారని అన్నారు.
ఆయన మన పక్కనే ఉంటారు కానీ సోషల్ మీడియాలో ఏదో కామెంట్ పెడుతూ ఉంటారు అది మనకు కూడా తెలియదు అని చెప్పుకొచ్చారు.ఒక్కొ వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది కానీ RGV లాంటి వారు చాలా అరుదు. ఇలాంటి వారు చనిపోయాక గాని వారి విలువ మనకు తెలియదని అన్నారు.
Also Read:సైలెంట్ గా స్టార్ట్ అయిన మెగాస్టార్ సినిమా షూటింగ్..!


ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక తెలుగు మూవీలా అనిపించింది. ఆ మూవీలో హీరో వెంకటేష్ హీరోగా నటించారు. అదే ధర్మచక్రం. ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 1996 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో గిరీష్ కర్నాడ్ వెంకటేష్ తండ్రి పాత్రలో నటించారు. ఆ సినిమా కూడా తండ్రీ, కుమారుల రిలేషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
ధర్మచక్రంలో వెంకటేష్ అగ్రెసివ్, యారిగెంట్ యాటిట్యూడ్‌తో కనిపిస్తాడు. ఇక యానిమల్ మూవీలో కూడా రణ్‌బీర్ కపూర్ కూడా అలాగే కనిపించడంతో సందీప్ రెడ్డి ధర్మచక్రం సినిమా నుండే యావిమల్ స్టోరీ లైన్‌ను తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కాపీ, లేదా ఇన్స్పిరేషన్ అనేది తెలియదు కానీ సందీప్ రెడ్డి దొరికిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













