యుక్త వయసులో కుర్రాళ్ళు చేసే చిలిపి పనులకు అడ్డు అదుపు ఉండదు. వారు చేసే పనులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా…. ఒక్కోసారి భలే ముచ్చటగా అనిపిస్తాయి. టీనేజ్ లో ఉండగానే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి ప్రేమించాలి అని తహతహ పడుతూ ఉంటారు. కొందరైతే తాను ప్రేమించే అమ్మాయి కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు.
పాటలు పాడుతూ అమ్మాయిల వెంట పడడం, బైక్స్ మీద స్టంట్ లు చేయడం, ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చి ఆకట్టుకోవడం ఇలా ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ పోతారు. కొందరి ప్రయత్నాలు ఫలిస్తాయి మరికొందరి ఫలించవు.ఇప్పుడు అలాంటి ఓ ప్రయత్నమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒక అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చాడు. అమ్మాయిని అప్సర పెన్సిల్ తో పోలుస్తూ అదరగొట్టాడు. “మీరు పెన్సిలా ఏంటి దూరం నుంచి అప్సరలాగా కనిపిస్తున్నారు” అని రాసి చివర్లో ఒక స్మైల్ సింబల్ వేశాడు.

గురుడు టాలెంట్ కి అమ్మాయి ఇంప్రెస్ అయ్యి ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ లెటర్ ను ట్విట్టర్ (x) లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కుర్రాడి టాలెంట్లకి నేటిజెన్లు ఇంప్రెస్ అయ్యారు. ఇంతకంటే బాగా ఎవరు ప్రపోజ్ చేస్తారు ఒప్పేసుకో అంటూ అమ్మాయికి కామెంట్లు పెట్టారు. మరికొందరైతే ఐడియా బాగుంది నేను కూడా ట్రై చేస్తా అని పెట్టారు. ఆ స్లిప్ ను లామినేషన్ చేసి ఉంచుకోండి జీవితాంతం మంచి జ్ఞాపకంగా ఉంటుందని మరొకరు పెట్టారు. ఇంతకీ ఆ అమ్మాయి గురుడు ప్రేమను ఒప్పుకుందో లేదో తెలియదు గాని, మనోడు టాలెంట్ మాత్రం ప్రపంచానికి తెలిసింది.












ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్య పేరు మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన ఐ డోంట్ కేర్ అంటూ వారికి సమాధానం చెబుతూ ఉంటారు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీ ఇచ్చే ఎనర్జీ బాలయ్య సొంతం.
భద్రత విషయంలో కనీస ప్రమాణాలు పాటించదు. ఫ్యాక్టరీలోని సీనియర్ వర్కర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తే నష్టాలు గురించి మాట్లాడతారు తప్ప వాటిని పట్టించుకోరు. ఫ్యాక్టరీ కి పక్కనే ఉన్న బస్తీలో నివసిస్తుంటాడు ఇమాద్(బాబిల్ ఖాన్). అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇమాద్ తన స్నేహితుడు మరణించడంతో అక్కడ మానేసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో జాయిన్ అవుతాడు. ఇమాద్ ద్వారా ఫ్యాక్టరీలోని లోపాలు తెలుసుకున్న రిపోర్టర్(సన్నీ ఇందుజా) దానికి సంబంధించిన నివేదిక కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్ అవుతుంది. భోపాల్ పరిసర ప్రాంతమంతా వ్యాపిస్తుంది.

ఆయనను తప్ప పాత్రలలో వేరే వాళ్ళని ఊహించుకోలేం. ఇమాద్ పాత్రలో బాబిల్ ఖాన్ జీవించేసాడు. దివ్యేందు శర్మ కూడా ఆకట్టుకున్నాడు. రతి పాండే గా మాధవన్ ఇంటెన్సిటీతో నటించాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రకి న్యాయం చేశారు. టెక్నికల్ గా ఈ సీరీస్ కోసం పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. సామ్ సాట్లర్ సంగీతం ప్రాణం పోసింది. రూబెన్ సినిమాటోగ్రఫి సిరీస్ ను మరో స్థాయిలో నిలబెట్టింది.తప్పిస్తే ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ ను కుటుంబ సమేతంగా చూడవచ్చు. ఆనాటి దుర్ఘటన ఎలా జరిగిందో కళ్ళకు కట్టారు.
