సినీ పరిశ్రమను రంగుల ప్రపంచం అని అంటారు. ఇక్కడ ఫేమ్ ఉండి అవకాశాలు వచ్చిన సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోగలగాలి. లేదంటే అవకాశాలు, ఫేమ్ తగ్గినపుడు, చేతిలో డబ్బు లేకపోతే జీవితంలో కష్టాలు తప్పవు. బాగా బ్రతికిన సమయంలో సంపాదించిన డబ్బును దాచుకోలేని ఎందరో గొప్ప నటీనటులు వారి చారమాంకంలో సాయం చేసేవారు లేక దీన స్థితిలో కన్నుమూశారు.
అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ నిషా నూర్ కూడా ఒకరు. ఆమె ఇప్పటి తరం వారికి తెలియక పోవచ్చు. కానీ 80 లలో ప్రేక్షకులకు సూపరిచితమే. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆమె, ఆ తర్వాత ఊహించిన పరిస్థితుల్లో కన్నుమూసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నటి నిషా నూర్ తన గ్లామర్‌తో 1980లో సిల్వర్ స్క్రీన్ ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలలో నటిస్తూ దక్షణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, భాను చందర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అగ్ర దర్శకులు అయిన బాలచందర్, భారతీరాజా విసు, చంద్రశేఖర్ లాంటి వారితో పని చేసింది. కమల్ హాసన్ తో కలిసి ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమాలో, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో పలు సినిమాలు చేసింది.
తన గ్లామర్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్ కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటివరకు స్టార్ స్టేటస్ పొందిన నిషా నూర్ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలని వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పని చేయాలి. కానీ ఆమె తప్పు దారిని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది.
అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి, ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జీవో ముందుకు వచ్చి, నిషా నూర్ కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పటల్ లోనే నిషా నూర్ 2007లో అనాధలా మరణించింది.
Also Read: “రిషబ్ శెట్టి” నుండి… “పవన్ కళ్యాణ్” వరకు… సినిమాల కోసం “నాన్-వెజ్” మానేసిన 8 నటులు..!






మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి
‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.
రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.
అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.
మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది.
సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లు మరియు వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.




