వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్‌ను టీంఇండియా 191 పరుగులకు ఆలౌట్ చేసింది.
అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చేసిన ఒక పొరబాటు నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే జరిగిన పొరబాటును తెలుసుకుని కోహ్లీ వెంటనే సరిదిద్దుకున్నాడు. అయినప్పటికీ నెటిజన్లు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఆ పొరపాటు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అందరి దృష్టి దాని పైనే ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రపంచకప్ లో భాగంగా అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పాక్ 191 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ బ్యాటింగ్ దిగింది. అయితే ఈ మ్యాచ్ మొదట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది.
భారత స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లి చిన్న మిస్టేక్ చేశాడు. అయితే వెంటనే దానిని గుర్తించిన కోహ్లీ సరిచేసుకున్నాడు. ఇక కోహ్లీకి సంబంధించిన ఏ విషయం అయిన క్షణాల్లో వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. కోహ్లీ తన పొరపాటును సరిచేసుకునేలోపే ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు ప్లేయర్స్ అంతా ఒక జెర్సీ ధరించి వచ్చారు. అయితే విరాట్ కోహ్లి ఒక్కడు వేరే జెర్సీని ధరించి వచ్చాడు.
ఈ విషయాన్ని గుర్తించిన కోహ్లీ మ్యాచ్ మధ్యలోనే వెళ్ళి, జెర్సీని మార్చుకుని వచ్చాడు. అయితే మిగతా భారత క్రికెటర్ల జెర్సీ, కోహ్లి ధరించిన జెర్సీ ఒకేలా ఉన్నాయి. కానీ జెర్సీ భుజం పైన ఉన్న స్ట్రిప్స్ ఒక్కటే డిఫరెంట్ గా ఉన్నాయి. మిగతా టీమిండియా ప్లేయర్ల జెర్సీ పై మూడు రంగుల స్ట్రిప్ ఉంది. అయితే కోహ్లి వేసుకున్న జెర్సీకి వైట్ లైన్స్ ఉన్నాయి. ఈ విషయన్ని గమనించిన కోహ్లీ వెంటనే జెర్సీని మార్చుకుని వచ్చేశాడు. అయితే అప్పటికే ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read: ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే పెద్ద క్రికెటర్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?

1. మిథున రాశి:
2. సింహరాశి:
3. తులారాశి:
4. వృశ్చికరాశి:
5. మకర రాశి:
ఈ ఐదు రాశుల పై నేడు వచ్చే సూర్యగ్రహణ ప్రభావంమూడు నెలల పదహారు రోజుల పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దైవంగా భావిస్తారు. ఆ విషయాన్ని పలు ఈవెంట్స్ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజాగా వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల పై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ” నమస్కారం, నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే, నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది. చిరాకు వేస్తోంది. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడు, దైవసమానులు అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన హోదాను ఇచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను, మీకు చెప్తాను.
నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆ కష్టం నాదే అని ముందుకెళ్ళే వ్యక్తి, భోళా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే, అని నేను భావిస్తున్నాను. ఉరికురికే అదొక్కటే రీజన్, మరొకటి లేదా, పదే పదే అదే విషయం మాట్లాడటం, చాలా బాధ పడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏ రోజు స్వార్ధంతో కానీ, స్వలాభంతో కానీ ఏ పని చేయడు, అలా మాట్లాడటం కానీ, ఆయన మాటల్లో, చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్‌లు చేసుకుంటూ, సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ, హాయిగా బ్రతకండి అని చెబుతూండేవాన్ని.వెయ్యేళ్లు బ్రతుకుతామా, మనం పోయినా కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలని, జనానికి ఏదైనా చేయాలని అనేవారు. ఆయన ఆలోచనలన్నిటిని నీతిగా, నిజాయితీగా అడుగాడుగు పేర్చుకుంటూ, భరిస్తూ, సహిస్తూ తలవంచుకుని జనం కోసం బ్రతకాలని, రాత్రిపగలు కష్టపడుతున్నాడు.
నిస్వార్ధంగా కష్టపడుతున్నాడు. రాత్రిపగలు షూటింగ్స్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీకి ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గరా, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పార్టీని నడుపుతున్న మహానుభావుడు. దయచేసి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టంలో ఉన్నా అంటే సహాయం చేస్తాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. భారతీయులంతా ఒక్కటే, మనం మనుషులం, మనుషులుగానే బ్రతకాలని చెప్పేవారు.
ఆయనకు గాని కుల పిచ్చి ఉంటే నన్ను ఆదరించేవాడా? నాకీ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి, తెలిసి తెలియకుండా, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తి పై అభాండాలు వేయకండి. నేను జనసేన వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషిని” అంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ క్రికెటర్ గా ఎదిగారు. ఫార్మాట్ ఏదైనా సరే ఇంటర్నేషనల్ క్రికెట్లో పరుగులు వర్షం కురిపిస్తాడు. తన పరుగులతో రికార్డులను కొల్లగొట్టేస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తరువాత ఆ రేంజ్ లో పరుగులు చేస్తూ, సెంచరీలు కొడుతూ, అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ తనకు తానే సాటి. ఈ క్రికెటర్ కి సామాజిక మధ్యమాలలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. అభిమానులు ప్రేమగా కింగ్ కోహ్లీ అని పిలుచుకునే విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ 1988లో నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ హిందూ ఫ్యామిలిలో జన్మించాడు. తండ్రి పేరు ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్, తల్లి సరోజ్ కోహ్లి గృహిణి. విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. కోహ్లీ మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే క్రికెట్ పట్ల ఆసక్తిని ప్రదర్శించాడని తెలుస్తోంది. విరాట్ తండ్రి తన కుమారుడి ఆసక్తిని గమనించి, 1998 లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్చాడు. శిక్షణ పొందిన కోహ్లీ పట్టుదలతో అండర్-15 ఢిల్లీ జట్టులోకి ప్రవేశించాడు.
కోహ్లీ జూనియర్ క్రికెట్ కెరీర్ అక్టోబర్ 2002లో లుహ్ను క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన పాలీ ఉమ్రిగర్ మ్యాచ్‌లో ప్రారంభమైంది. అరంగేట్రం మ్యాచ్‌లో కోహ్లి మొత్తం పదిహేను పరుగులు చేయగలిగాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో, బీసీసీఐ నిర్వహించిన గేమ్‌లో 119 స్కోరుతో కోహ్లీ తన తొలి సెంచరీని సాధించాడు. ఆ సీజన్ ముగిసే సమయానికి, కోహ్లీ 78 సగటుతో మొత్తం 390 పరుగులు చేశాడు. అలా మొదలై, రన్‌మెషిన్ గా పేరుతెచ్చుకున్న కోహ్లీ తనదైన శైలిలో అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు.
బుధవారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 76 పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా రెండవ గేమ్‌లో పవర్‌ప్లేలో వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. 9 ఓవర్లు బౌలింగ్‌లో చేసినప్పటికీ, ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాంతో మహ్మద్ షమీని, పక్కన పెట్టి మహ్మద్ సిరాజ్‌ను జట్టుకు సెలెక్ట్ చేసి, జట్టు మేనేజ్మెంట్ తప్పుచేసిందని సామాజిక మధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదే విషయం పై భారత మాజీ బౌలర్ శ్రీశాంత్ ఒక స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, “మ్యాచ్‌కు ముందు, అందరూ శార్దూల్ ఎందుకు ఆడుతున్నారు? అని అనడం మొదలుపెట్టారు. ఇక మ్యాచ్ ప్రారంభం అయిన తరువాత సిరాజ్ పరుగులిస్తుంటే, ఎందుకు సిరాజ్ ను ఆడిస్తున్నారు ? అని విమర్శలు చేస్తున్నారు. వీళ్ళంతా టోపీ మాస్టర్లు” అని అన్నారు.
అది మాత్రమే కాకుండా “కెమెరాలు మళ్ళీ మళ్ళీ మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ లపై ఫోకస్ చేసి, చూపిస్తూనే ఉండటం అనేది దేనిని సూచిస్తోంది. మన మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసిన జట్టుకు మనం అందరూ అండగా నిలవాలి కదా’’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఒక మార్పుతో ఆడిన విషయం తెలిసిందే.
రెస్టారెంట్లలో జీఎస్టి అమలులోకి వచ్చిన అనంతరం, రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్ల దగ్గర జీఎస్టి పేరుతో ఎక్కువగా వసూలు చేస్తున్నారనే విషయం తెలిసొందే. చిన్నపాటి ఏసీ రెస్టారెంటులో ఫుడ్ తిన్నాకూడా కనీసం 18 శాతం జీఎస్టి కట్టాల్సి వస్తోంది. దీనికి తోడు సర్వీస్ చార్జి మరో పది శాతం. చాలా హోటళ్లు జీఎస్టి లెక్కపెట్టేటప్పుడు సర్వీస్ చార్జిని కూడా కలుపుతున్నాయి.
అయితే కొన్ని రెస్టారెంట్స్ కంపోజిషన్ ట్యాక్స్‌పేయర్ గా ఉన్నప్పటికీ కూడా బిల్ లో జీఎస్టిని కూడా కలిపి, కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఈ టాక్స్ పేయర్స్ గా ఉన్న రెస్టారెంట్స్ లో జీఎస్టి కట్టాల్సిన అవసరం లేదు. మరి కంపోజిషన్ ట్యాక్స్‌పేయర్ అవునో కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది.
బిల్లు పై ఉన్న GST చెల్లించాలా వద్దా అని ఎలా చెక్ చేయాలంటే..?
సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా తన వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చారని, ఇద్దరికి సాధారణ బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో కొందరికి ముందస్తు బెయిల్, కొందరికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు, చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వరని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
జస్టిస్ అనిరుద్ద బోస్ ఫైబర్ నెట్ కేసులో సెక్షన్ 17ఏ ప్రస్తావన ఉండడం వల్ల తరువాతి విచారణను అక్టోబర్ 17 మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. దాంతో అక్టోబర్ 17కి విచారణ వాయిదా వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పీటీ వారంట్ ప్రకారం చంద్రబాబు నాయుడును సోమవారం నాడు ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారని, ఆ రోజు హాజరుపరిస్తే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారని, లూథ్రా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దాంతో జస్టిస్ బోస్ మాట్లాడుతూ ఆర్డర్ ను పాస్ చేయడం లేదు.
కానీ సోమవారం దాకా చంద్రబాబును అరెస్టు చేయవద్దని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీకి చెప్పారు. 17ఏ పై వాదనలు పూర్తి కాలేదు. అందువల్ల ఫైబర్ నెట్ కేసులో ఆర్డర్స్ ఇవ్వలేమని తెలిపారు. అయితే, సోమవారం నాడు చంద్రబాబు అరెస్ట్ చేయరని సీఐడీ తరపున ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు. ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారానికి వాయిదా వేయమని సమాచారం ఇస్తామని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు.
అందరికి డబ్బులను పర్సులో పెట్టుకోవడం అనే అలవాటు ఉంటుంది. అయితే ఆ పర్సును ప్యాంట్ వెనక జేబులో పెట్టుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం అనే విషయం చాలామందికి తెలియదు. పర్సుకానీ, వాలెట్‌ని కానీ మగవారు మరియు కొందరు స్త్రీలు బాక్ పాకెట్లో పెట్టుకుంటారు. అలా పెట్టకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని, ఓ వయసు వచ్చేసరికి, వారు సరిగా నడవలేక, వంగిపోతారని దానికి కారణం పర్సును వెనక ప్యాంట్ జేబులో పెట్టుకోవడం వల్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అది మాత్రమే కాకుండా ఎక్కువసేపు వెనక ప్యాంటు జేబులో పర్సు పెట్టుకోవడంతో “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” అనే సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు. పర్సు అలా పెట్టుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తరుచుగా మెడ, వెన్ను, భుజాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు.
వెనుక జేబులో పర్సు పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చొనేవారికి నడుముకు సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పర్సులను జేబులో పెట్టుకొని గంటలపాటు కూర్చొనేవారికి, డ్రైవింగ్ చేసేవారికి తీవ్ర నడుము నొప్పి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాలెట్ జేబులో పెట్టుకుని కూర్చోవడం వల్ల వెన్నుముక చివరి భాగం పై ప్రెజర్ పడుతుంది. బరువైన, ఎత్తుగా ఉండే వాలెట్ పై కూర్చోవడం వల్ల కండరాల సామర్థ్యం తగ్గుతుంది. దీంతో కండరాలలో విపరీతమైన నొప్పి కలుగుతుందని సూచిస్తున్నారు.
వాలెట్ లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వోచ్చర్స్, ఆధార్ కార్డుల వంటి పలు కార్డులు పెట్టుకోవడం వల్ల అది బరువుగా మారిపోతుంది. దాన్ని బ్యాక్ జేబులో పెట్టుకోవడం వల్ల తుంటి కండరాలు మరియు కీళ్లు ఒత్తడి పడి, ఒంగిపోతాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు వాలెట్ ను బ్యాగ్ లో లేదా, డెస్క్ లో పెట్టుకోవాలి. వాహనాలు డ్రైవ్ చేస్తున్నప్పుడు బైక్ కవర్లో కానీ, కారు డెస్క్‌లో కానీ పెట్టాలి. పర్సులో అనవసరమైన వాటిని తొలగించాలి. సాఫ్ట్ గా ఉండే పర్సు వాడాలి. పర్సులో కాయిన్స్, కార్డులు లేకుండా నగదు ఉండేలా జాగ్రత్తగా పడాలి.



ఆ ఊరిలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు అనావృష్టితో ఇబ్బందులు పడతుంటారు.ఊరి పెద్ద లందరు ఈ సమస్య తీరాలంటే గంగాలమ్మ జాతర చేయాలని తీర్మానిస్తారు. కానీ జాతర చేసే సమయంలో అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమస్యను ఊరిపెద్దలు ఎలా పరిష్కరించారు? కుమార్,కృష్ణవేణి ప్రేమకు, గంగాలమ్మ జాతరకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
స్టోరీ పరంగా కొత్తగా లేదు, హీరోహీరోయిన్ల రొటీన్ ప్రేమకథ. రోషం రాజు పాత్ర కోడి కూర కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చౌడప్ప తన మిత్రుడిని చంపిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మూవీ అంతా ఒకెత్తు అయితే, సినిమా చివర్లోని ట్విస్ట్ మరోక ఎత్తు. అప్పటి దాకా మెల్లగా సాగిన స్టోరీ, కొన్ని క్యారెక్టర్స్,క్లైమాక్స్‌లో వారు ఇచ్చే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నూతన నటీనటులైనా, ప్రతీ ఒక్కరు కూడా నటనతో ఆకట్టుకున్నారు. హీరో రవి మహాదాస్యం, హీరోయిన్ విషికా కోట తమ నటనతో ఆకట్టుకున్నారు. రోషమ్ రాజు క్యారెక్టర్ బాగుంది. తనదైన కామెడీతో రోషమ్ రాజు ఆకట్టుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ :