“వీళ్లంతా టోపీ మాస్టర్లు..!”అంటూ… మాజీ పేసర్ “శ్రీశాంత్” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“వీళ్లంతా టోపీ మాస్టర్లు..!”అంటూ… మాజీ పేసర్ “శ్రీశాంత్” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

బుధవారం నాడు ఢిల్లీలో 2023 ప్రపంచకప్ టోర్నీలో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన తరువాత భారత స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పై క్రికెట్ పండితులు మరియు క్రికెట్ అభిమానులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Video Advertisement

బౌలర్‌ సిరాజ్‌ కు టీం ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ మద్ధతుగా నిలిచాడు. జట్టు మేనేజ్‌మెంట్‌ అన్ని విషయాలు ఆలోచించిన తరువాతనే తుదిజట్టును సెలెక్ట్ చేస్తుందని, మ్యాచ్‌ జరుగుతున్న విధానాన్ని బట్టి విమర్శించడం  సరికాదని అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బుధవారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 76 పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా రెండవ గేమ్‌లో పవర్‌ప్లేలో వికెట్ తీయడంలో విఫలమయ్యాడు.  9 ఓవర్లు బౌలింగ్‌లో చేసినప్పటికీ, ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. దాంతో మహ్మద్‌ షమీని, పక్కన పెట్టి మహ్మద్‌ సిరాజ్‌ను జట్టుకు సెలెక్ట్ చేసి, జట్టు మేనేజ్‌మెంట్‌ తప్పుచేసిందని సామాజిక మధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదే విషయం పై భారత మాజీ బౌలర్‌ శ్రీశాంత్‌ ఒక స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, “మ్యాచ్‌కు ముందు, అందరూ శార్దూల్ ఎందుకు ఆడుతున్నారు? అని అనడం మొదలుపెట్టారు. ఇక మ్యాచ్ ప్రారంభం అయిన తరువాత సిరాజ్ పరుగులిస్తుంటే,  ఎందుకు సిరాజ్ ను ఆడిస్తున్నారు ? అని విమర్శలు చేస్తున్నారు. వీళ్ళంతా టోపీ మాస్టర్లు” అని అన్నారు.
అది మాత్రమే కాకుండా “కెమెరాలు మళ్ళీ మళ్ళీ మహ్మద్‌ షమీ, రవిచంద్రన్ అశ్విన్ లపై ఫోకస్ చేసి, చూపిస్తూనే ఉండటం అనేది దేనిని సూచిస్తోంది. మన మేనేజ్‌మెంట్‌ సెలెక్ట్ చేసిన జట్టుకు మనం అందరూ అండగా నిలవాలి కదా’’ అని శ్రీశాంత్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఒక మార్పుతో ఆడిన విషయం తెలిసిందే.

Also Read: రోహిత్ కాదు… కోహ్లీ కాదు… టీం ఇండియాలో ఈ ప్లేయర్ అందరికంటే ఎక్కువ భయపెడుతున్నాడా..? ఎవరంటే..?

 


End of Article

You may also like