సినిమా అట్ట్రాక్ట్ అవ్వాలి అంటే టైటిల్ చాలా ముఖ్యమైనది. టైటిల్ రిలీజ్ చేయగానే… ఆ టైటిల్ ని బట్టే చాలా వరకు సినిమా కి హైప్ వస్తుంది. అందుకే దర్శకులు కూడా టైటిల్ విషయం లో చాలా జాగ్రత్త గా ఉంటారు. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య మనం డిఫరెంట్ గా ఉండే చాలా టైటిల్స్ ని చూసాం..
అవి కాకుండా మన తెలుగు పండగల పేర్లతో వచ్చిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం..
#1 సంక్రాంతి
2005లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వెంకటేష్, శ్రీకాంత్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘సంక్రాంతి’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
#2 దసరా
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్నా చిత్రం దసరా.
#3 హోలీ
ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం లో ఉదయ్ కిరణ్, రిచా హీరో హీరోయిన్లు గా వచ్చిన చిత్రం హోలీ. ఈ చిత్రం 2002 లో రిలీజ్ అయ్యింది.
#4 ఉగాది
1997 లో ఎస్. వి. కృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన సినిమా ఉగాది. లైలా కథానాయికగా నటించింది.
#5 మహా శివరాత్రి
రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో రేణుక శర్మ దర్శకత్వం లో వచ్చిన చిత్రం మహా శివరాత్రి.
#6 రాఖీ
2006 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాఖీ. ఈ చిత్రం లో ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి ప్రధాన పాత్రల్లో నటించారు.
#7 గురు పౌర్ణమి
హీరోయిన్ నగ్మా, బాల సుబ్రమణ్యం ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం గురు పౌర్ణమి. దీనికి రామ నారాయణ దర్శకుడు.
#8 కార్తీక పౌర్ణమి
కార్తీక పౌర్ణమి సినిమా లో శోభన్ బాబు, భాను ప్రియ, రాధిక శరత్ కుమార్, సుత్తివేలు, కైకాల సత్యనారాయణ తదితరులు నటించారు. ఈ సినిమాకి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు.
#9 కృష్ణాష్టమి
2016 లో వాసు వర్మ దర్శకత్వం లో సునీల్ హీరోగా వచ్చిన చిత్రం కృష్ణాష్టమి. నిక్కీ గల్రానీ, డింపల్ చొపడా ప్రధాన పాత్రల్లో నటించారు.
#10 వినాయక చవితి
1957 లో ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడిగా నటించిన చిత్రం వినాయక చవితి. ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించారు.
#11 దీపావళి
2008 లో ఆర్తి అగర్వాల్, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం దీపావళి. ఇదే కాకుండా 1960 లో కూడా ఎన్టీఆర్, యస్వీ రంగ రావు ప్రధాన పాత్రల్లో కూడా ఒక దీపావళి చిత్రం వచ్చింది.
#12 నాగుల చవితి
జమున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నాగుల చవితి. ఈ చిత్రం 1956 లో విడుదల అయ్యింది.