భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న జరుగబోతుంది. ప్రస్తుతం అందరి దృష్టి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలపై పడింది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు గత ఏడాది ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చి 1నుండి 3 మధ్యన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే సందడి కూడా ప్రారంభం అయ్యింది. అంబానీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతున్న రాధికా మర్చంట్ గురించిన విషయాలను ఇప్పుడు చూద్దాం..
ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్ధం 2023 లో జనవరి 19న రాధిక మర్చంట్ రాజస్తాన్ లో శ్రీనాథ్ జీ దేవాలయంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్యలో జరిగింది. అనంత్, రాధికాలకు చాలాకాలం నుండే పరిచయం ఉంది. ఇన్నిరోజులు మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు, త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. రాధిక మర్చంట్ తండ్రి పేరు వీరేన్ మర్చంట్, ఆయన కూడా పారిశ్రామిక వేత్తనే.

రాధిక 1994లో డిసెంబర్ 18న శైల మర్చంట్, వీరేన్ మర్చంట్ లకు జన్మించారు. వీరెన్ మర్చంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత. అంతేకాకుండా ఇండియాలోని అత్యంత ధనవంతుల్లో ఆయన కూడా ఒకరు. రాధిక ముంబైలో, ఆ తరువాత న్యూయార్క్ లో విద్యాభ్యాసం చేశారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలటికల్ సైన్స్, ఎకనమిక్స్ లో డిగ్రీ పొందారు. చదువు పూర్తయిన తరువాత ముంబైలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఇస్ప్రవ’ లో కొన్ని రోజులు జాబ్ చేశారు. ప్రస్తుతం రాధికా మర్చంట్ తమ సొంత సంస్థ ఎన్కోర్ హెల్త్‌కేర్ లో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
రాధిక మర్చంట్ కూడా కాబోయే అత్తగాఋ అయిన నీతా అంబానీ వలె భరత నాట్య కళాకారిణి. ఆమె ముంబైలో గురు భావన ఠాకూర్ దగ్గర శ్రీ నిభా ఆర్ట్స్ డాన్స్ అకాడమీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు శిక్షణ తీసుకున్నారు. రాధిక భరత నాట్య అరంగేట్రంను అంబానీ ఫ్యామిలీ 2022 లో ‘జియో వరల్డ్ సెంటర్’ లో నిర్వహించిన కార్యక్రమంలో చేశారు. ఈ ఈవెంట్ కి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. రాధిక మర్చంట్ ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read: RK BEACH FLOATING BRIDGE: పెట్టిన మరుసటి రోజునే ఊడిపోయింది అని ట్రోల్ చేసారు.. కానీ ఇది అసలు కథ..!





లెజెండరీ దర్శకుడు కె వి రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక చిత్రంలో శివుడిగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆ సమయంలో ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్. పరమశివుడి క్యారెక్టర్ చేసేటపుడు శివుడి మెడలో నాగుపాము కూడా ఉండాలి. నాగుపాము కోసం అప్పట్లో రబ్బర్ పాములను కొందరు ఉపయోగించేవారు. మరికొందరు కోరలు తీసిన పాములను షూటింగ్ కోసం వాడేవారు. ఎన్టీఆర్ కి రబ్బర్ పామును వాడడం వల్ల ఎలర్జీ రావడంతో ఈ మూవీ షూటింగ్ లో కోరలు లేని పామును ఉపయోగించారు.
సన్నివేశాన్ని షూట్ చేసే ముందు పాములను ఆడించే అతను ఆ పాముకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ క్రమంలోనే పాముకి ట్రైనింగ్ ఇవ్వడం చూసిన ఎన్టీఆర్, అతన్ని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారంట. దానికి సింగీతం శ్రీనివాస్ పాము మెడలోకి వెళ్ళేలా ట్రైనింగ్ ఇస్తున్నారని అన్నారంట. అప్పుడు ఎన్టీఆర్ “అలాంటిది ఏమి అవసరం లేదు. వారిని వదిలిపెట్టండి. మెడలోకి ఆయనే వస్తారు” అని అన్నారంట. ఎన్టీఆర్ అలా అనగానే దర్శకుడు కె వి రెడ్డి “ఆయనికి బ్రెయిన్ ఉందని, పాముకి కూడా బ్రెయిన్ ఉంటదని భావిస్తున్నాడా ” అని అన్నారంట.
ఈ సన్నివేశం మొదలై, వెనకాల సౌండ్ స్టార్ట్ కాగానే ఆ పాము నెమ్మదిగా వెళ్లి ఎన్టీఆర్ మెడకి చుట్టుకుని ఆభరణంలా కనిపించిందంట. ఆ దృశ్యాన్ని చూసిన కె వి రెడ్డి, “రామారావు నువ్వు చాలా గొప్పవాడివి, అంతకుమించిన వాడివి” అంటూ దణ్ణం పెట్టారంట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గత ఏడాది మే 28 నుండి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు.











ప్రతీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పైన దాని ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. గడువు దాటిన సిలిండర్లలో లీకేజీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సిలిండర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సిలిండర్ పైన భాగంలో గుండ్రటి హ్యాండిల్ లాంటిది పట్టుకునేందుకు ఉంటుంది. దాని కింది వైపుగా సిలిండర్‌కు సపోర్ట్ గా 3 ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్ల లోపలి వైపున చూసినపుడు నంబర్స్ ఉండడం కనిపిస్తుంది. ఈ మూడింటిలో ఒక దాని మీద ఆ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ తేదీ ఉంటుంది.
అలా దానిపైన ఒక ఇంగ్లీష్ అక్షరం మరియు నంబర్ ఉంటుంది. అవి సంవత్సరం మరియు నెలకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న సిలిండర్ పైన A 22 అని ఉంటే జనవరి నుండి మార్చి, 2022 వరకు అర్ధం. మార్చి ఆ సిలిండర్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక B అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు, C అంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు, D అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ నెల వరకు అని అర్థం. ఇక నంబర్ సంవత్సరాన్ని తెలుపుతుంది.
గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చిన వెంటనే, దాని ఎక్స్పైరీ తేదీని చెక్ చేసుకొని తీసుకోవాలి. లేదంటే గడువు దాటిన సిలిండర్ లీకేజీల వల్ల పేలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సీల్ ను కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎలాంటి క్రాక్స్ ఉండకూడదని రూల్స్ చెబుతున్నాయి.






కళాతపస్వి కె విశ్వనాధ్ మూవీ అంటేనే, దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో సంగీత, నృత్య, సాహిత్య, కళాత్మక విలువల గురించి అద్భుతంగా చూపిస్తుంటారు. అదేకోవలో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్వర్ణ కమలం. ఈ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించగా కీలక పాత్రలలో చాలామంది నటీనటులు కనిపించారు.
కళ అనేది జన్మ జన్మల పుణ్యం వల్లే వస్తుందని గ్రహించలేని వేదపండితుడి కూతురు కథే ఈ మూవీ. సమాజం వేగంగా మారుతోంది. దానితో పాటే మనమూ వెళ్లాలి. సంప్రదాయ కళలనే నమ్ముకుని బావిలో కప్పల బతకడం ఏమిటి అనుకునే మీనాక్షి పాత్రలో భానుప్రియ అద్భుతంగా నటించింది. మూవీ ప్రారంభంలో తండ్రి నేర్పించిన కూచిపూడి నాట్యం కడుపు నింపదనే భావనతో అయిష్టత ప్రదర్శస్తుంటుంది. ఆ సమయంలో ఆమె తయారయ్యే విధానం కూడా గందరగోళంగా ఉంటుంది.
కానీ ఆమెలో మార్పు వచ్చిన తరువాత ఆమె తయారయ్యే విధానంలో మార్పును చూపిస్తూ, దర్శకుడు ఆ విషయాన్ని స్పష్టంగా ఆ సన్నివేశంలో చూపించారు. అప్పటి ప్రేక్షకులు ఈ విషయాన్ని ఎంతవరకు గ్రహించారో లేదో కానీ, ఒక మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూ కు ఈ రెండు సీన్స్ ను కలిపి చందమామ కథలు అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేస్తూ, అసలు పాత సినిమాలలోనే చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కానీ మనం గ్రహించలేదు అంటూ రాసుకొచ్చారు.

