మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20% ఇండియాకే దిగుమతి చేయబడింది అని మనలో చాలా మందికి తెలీదు.
ఆ కాలంలో ఇండియాలో 230 మంది మహారాజులు ఉన్నారు. దేశంలో సగటున 2000 రోల్స్ రాయిస్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఇండియన్ కింగ్స్ కి రోల్స్ రాయిస్ కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేది. రాజస్థాన్‌లోని అల్వార్ కు చెందిన ప్రముఖ మహారాజు “జై సింగ్” ఒకేసారి మూడు ఆటోమొబైల్స్ కొనుగోలు చేసేవాడు.
1920లో ఆల్వార్ మహారాజా జై సింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నాడు. అతను సాధారణ వస్త్రధారణలో ఉండి రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి ప్రవేశించాడు. అప్పుడు ఒక బ్రిటీష్ సేల్స్‌మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్టు వ్యవహరించాడు. ఎందుకంటే అతను కేవలం ఒక సాధారణ పేద భారతీయుడు అని.
కింగ్ జై సింగ్ ఈ అవమానాన్ని భరించలేక వెంటనే తన హోటల్ గదికి తిరిగి వచ్చాడు. అప్పుడు అతను తన సేవకులతో షోరూమ్‌కి కాల్ చేయించి, అల్వార్ నగర రాజు వారి కార్లలో కొన్నింటిని కొనుగోలు చేయబోతున్నాడని చెప్పించాడు. ఆ తర్వాత రాజు దర్శనాన్ని పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్‌మెన్స్ అందరూ బారులు తీరి షోరూమ్‌లో రెడ్ కార్పెట్ పరిచారు.
అప్పుడు రాజు తన రాజ రూపంలో షోరూమ్‌ని సందర్శించాడు. ఆ సమయంలో షోరూమ్‌లో ఆరు కార్లు ఉన్నాయి. రాజు ఒకేసారి ఆరు కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు.
ఆరు రోల్స్ రాయిస్ భారతదేశానికి దిగుమతి చేసాక, నగరంలోని వీధులను ఊడ్చేందుకు ఈ కార్లను ఉపయోగించాలని రాజు మున్సిపాలిటీని ఆదేశించాడు. కొద్దిసేపటికే ఈ వార్త ప్రపంచం అంత వ్యాపించింది. వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ షాక్ అయ్యింది.
దీంతో ఆ కంపనీ గుడ్ విల్ మరియు ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. చివరకు.. రోల్స్ రాయిస్ వారి ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ భారత రాజు జై సింగ్‌కు టెలిగ్రామ్ పంపింది. అంతేకాదు.. మరో ఆరు సరికొత్త కార్లను కూడా ఉచితంగా అందించింది. చెత్తను సేకరించడానికి రోల్స్ రాయిస్‌ను ఉపయోగించడం మానేయాలని రాజు మున్సిపాలిటీని కోరాడు. అలాగే కంపనీ క్షమాపణలను కూడా అంగీకరించాడు.
ఈ కథ చదివాక “ఇండియన్ కింగ్ దెబ్బ.. రోల్స్ రాయిస్ అబ్బా..” అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
















మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.
హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.


సివిల్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడానికి మూడు పరీక్షలను ఎదుర్కోవాలి. వాటిలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అభ్యర్థుల అకడమిక్ మరియు జనరల్ అవేర్నెస్ను మరియు విభిన్న అంశాలను పరీక్షించడం కోసం నిర్వహిస్తారు. ఇంటర్వ్యూను సివిల్ సర్వీసెస్ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం మరియు స్వభావానికి సంబంధించిన పరీక్ష అని చెప్పవచ్చు. సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉంటుందో, ఆ పరీక్ష పాస్ అయిన తరువాత అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రతి సంవత్సరం వేలాది మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే ఎంపిక అవుతుంటారు. దానికి ఎందుకంటే ఇంటర్వ్యూలోఆ దిగే ప్రశ్నలకు తర్కంతో ఆలోచిస్తే తప్ప జవాబులు చెప్పలేము. ఊహించని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. ఈ క్రమంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక యువకుడిని అడిగిన ప్రశ్న టాప్ ఐఏఎస్ ప్రశ్నల్లో ఒకటిగా నిలిచింది.
అది ఏమిటంటే, నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆమెకు చెవులు, కళ్ళు, నోరు పనిచేయవు. ఆమెను తాకకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు? అని అడిగారు. ఇది లాజిక్ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం, ఆ అబ్బాయి అంధుడు, చెవిటివాడు మరియు మూగవాడు కాదు కాబట్టి ప్రపోజ్ చేయగలడు. అయితే అతని ప్రతిపాదనను అమ్మాయి అర్థం చేసుకోవాలని చెప్పలేదు అని ఆ యువకుడు చెప్పాడు.












అరచేతిలో గీతాలు రకరకాలుగా ఉంటాయి. వీటితో పాటు గుర్తులు కూడా ఉంటాయి. అయితే అర చేతిలో రేఖల మధ్య ‘ఎక్స్’ (X) ఆకారంలో గుర్తు ఉంటే వారికి లైఫ్ లో తిరుగు ఉండదంట. ఇలాంటి గుర్తు ప్రపంచం మొత్తంలో 5 శాతం మందికి మాత్రమే ఉంటుందట. అరచేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం..
అర చేతిలో ఎక్స్ గుర్తు ఉన్నవారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. ఆ వ్యక్తి సక్సెస్ బాటలో నడవడమే కాక ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపిస్తారట. ఈ గుర్తు కలిగిన వ్యక్తులు ప్రపంచాన్ని కూడా జయిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అర చేతిలో ఈ ఎక్స్ గుర్తు ఉండేదట. అలాగే అలెగ్జాండర్ తన అరచేతి రేఖలను బలంగా నమ్మేవారంట. మాస్కోలో ఉండే హెచ్‌టీఐ యూనివర్సిటి సైంటిస్టులు చాలా మంది చేతి రేఖల పై పరిశోధనలు చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు అర చేతిలో ఎక్స్ గుర్తు ఉండేదని సైంటిస్టులు తెలియజేశారు. పరిశోధనల ప్రకారం రెండు అర చేతుల్లో ఎక్స్ గుర్తు ఉంటే వారు జీనియస్ అని, బలవంతులుగా ఉండడంతోపాటు ఇతర వ్యక్తులను తేలికగా అంచనా వేయగలరట. అలాగే వీరిని మోసం చేయడం చాలా కష్టం. ఎక్స్ గుర్తు ఉన్నవారు శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా ఉంటారట. ఈ వ్యక్తులు పేరు ప్రతిష్టలు, సమాజంలో చాలా గౌరవం ఉంటుందని సదరు పరిశోధకులు చెబుతున్నారు.