సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం గురించిన ప్రచారాలు తరచు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తరువాత జక్కన్న సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. అయితే తాజాగా మహేష్-జక్కన్న సినిమాలో ముఖ్యమైన పాత్రలో ఒక స్టార్ హిరో నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.










సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగి లంచం అడిగినప్పుడు, ఆ బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు లంచం అడిగిన విషయం చెప్పగానే వారు రంగంలోకి దిగుతారు. ఏసీబీ అధికారులు బాధితుడికి లంచం ఇవ్వడానికి కొంత డబ్బు ఇస్తారు. అయితే ఆ డబ్బు మీద ముందుగానే ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లి ఇస్తారు. బాధితుడు ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లిన డబ్బును లంచం అడిగిన గవర్నమెంట్ ఉద్యోగికి ఇస్తారు.
డబ్బు ఇచ్చిన వెంటనే ఆ గవర్నమెంట్ ఉద్యోగి అడిగిన డబ్బులు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కోసం ఆ డబ్బును లెక్క పెడతారు. అయితే ఆ కరెన్సీ నోట్లకు ఉన్న పినాప్తలిన్ పౌడర్ సదరు ఉద్యోగి చేతులకు అంటుతుంది. వెంటనే ఏసీబీ ఆఫీసర్లు సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు. లంచం తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగి చేతులను కాస్త సోడియం కార్బోనేట్ కలిపిన వాటర్ లో ముంచి తీస్తారు.
ఫినాప్తలిన్ పౌడర్ సోడియం కార్బోనేట్ కలిపిన ద్రావణంలో ముంచడంతో ఉద్యోగి చెయ్యి వెంటనే పింక్ రంగులోకి మారితుంది. అలా ఆ లంచం తీసుకున్న ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఏసీబీ అధికారులు పట్టుకున్న వ్యక్తితో పాటు, పింక్ కలర్ లోకి వచ్చిన ద్రావణంను కోర్టులో సాక్ష్యంగా చూపిస్తారు. అలా లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడేలా ఏసీబీ అధికారులు చేస్తారు.



