తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఆమె ఎక్స్పోజింగ్ చేయదని, సాంప్రదాయం ఉట్టి పడేలా, పక్కింటి అమ్మాయిలా ఉంటుందని ఆమెపై విపరీతమైన అభిమానం పెంచుకున్నారు ప్రేక్షకులు. ప్రేమమ్, అఆ శతమానంభవతి లాంటి చిత్రాలలో ఆమె వేసిన క్యారెక్టర్లు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ పాప తన రూటుని మార్చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ స్క్రీన్ షో చేయడం, సినిమాల్లో కూడా లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోవటం చేస్తుంది.

అయితే ఇవన్నీ చూసిన అనుపమ పరమేశ్వరన్ డై హార్ట్ ఫ్యాన్స్ కి హార్ట్ లు బ్రేక్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు ఆమెని ఒక అభినవ సావిత్రి సౌందర్య లాగా ఊహించుకున్న ప్రేక్షకులు రూటు మార్చుకున్న అనుపమని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ కిస్ సీన్స్ తో రెచ్చిపోయిన అనుపమ రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అనుపమ ఫాన్స్ హృదయాలు మరింత బద్దలైపోయాయి.
సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పలువురు అభిమానులు అనుపమ.. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మెసేజ్లు పెడుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ కి వీర అభిమాని అయిన ఒక ఆటో డ్రైవర్ తన ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేశాడు. అనుపమ గారు నా ఆటోలో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా.. ఒకప్పుడు మీరు నటించిన పాత్రలు అలాంటివి. అఆ సినిమాలో మీరు చేసిన పాత్ర ఎలాంటిదో గుర్తుందా..

శతమానం భవతి మిమ్మల్ని చూసి మరదలు అంటే ఇలానే ఉండాలి అనుకున్నాము, ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాలతో మమ్మల్ని అలరించారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఎలాంటివి? మీ అభిమానులు మీ నుంచి రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పటి సావిత్రి, సౌందర్య గారి లాగా మీరు అనుకున్నాము కానీ ఇప్పుడు మీరు రూట్ మార్చేశారు. ఇది మాకేమాత్రం నచ్చటం లేదు అని ఒక అభిమానిగా చాలా ఫీల్ అవుతున్నాను అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.
#TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు. pic.twitter.com/Wnc4yRB1oA
— Actual India (@ActualIndia) February 18, 2024

మరి ముఖ్యంగా అమ్మాయిల ఈమధ్యకాలంలో సినిమాలలో చూపించినట్టుగా ఇంట్లో టి షర్ట్, షార్ట్స్ ఎక్కువగా ధరిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా టి షర్ట్, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఒకప్పుడు హిందీ సినిమాలలో హీరోయిన్లు చిన్న చిన్న టి షర్ట్, షార్ట్స్ వేసుకునేవారు.
ఆ తరువాత కాలంలో తెలుగు సినిమాలలో కూడా ఈ ఫ్యాషన్ వచ్చింది. వాటిని చూసిన అమ్మాయిలు అలానే పడుకునే సమయంలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు టి షర్ట్, షార్ట్స్ వేసుకుంటున్నారు. అడిగితే ట్రెండ్ కు తగ్గట్టుగా నడుస్తున్నామని అంటున్నారు. కానీ వారు వేసుకునే బట్టలు ఖచ్చితంగా సినిమా ప్రభావమే అని అన్నారు. అమ్మాయిలు ఫ్యాషన్ లో మార్పు వచ్చినపుడు, వారు యాక్సెసరిస్ ఎక్కువగా కోరుకుంటారు. వాటికోసం ఎక్కువగా ఖర్చుపెడుతూ ఉంటారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ప్రతి సినిమాని నియమ నిబంధనలు ఫాలో అవ్వకుండా చూస్తున్నారు. దాంతో యువత కూడా తమ వయసుకి మించిన సినిమాలు చూస్తున్నారు. తెలిసి తెలియని వయసులో వారు ఉంటారు కాబట్టి అందులో హీరో హీరోయిన్లు చేసే విషయాలని వారు ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా సినిమాలు చూసే ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్న లీడ్ రోల్ ఎలాంటి పనులు అయితే చేశారో అలాంటివే చేయాలి అనుకుంటారు.




























