అయోధ్య బాల రాముని మందిరం ప్రారంభోత్సవం జరిగి బాల రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత రాములవారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలలు నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇప్పటికే బాల రాముని దర్శన వేళలను రామ మందిరం ట్రస్ట్ ప్రకటించింది. అలాగే దేశాన్ని నలుమూలల నుండి కూడా రైల్వే డిపార్ట్మెంటు, ఏరోప్లేన్ సంస్థలు కూడా తమ సర్వీస్ లను ప్రారంభించి షెడ్యూల్‌లను విడుదల చేశాయి.
అయోధ్యలో టెంపుల్ టూరిజం తో పాటు హోటల్లు రెస్టారెంట్లు వ్యాపార సామ్రాజ్యాలు కూడా వెలిసాయి. ఇప్పుడు అయోధ్య దేశంలోనే నెంబర్ వన్ స్పాట్ గా నిలిచింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగినా తర్వాత 11 రోజులలో రాములవారిని 25 లక్షల మంది దర్శించుకున్నారట. దర్శించుకోవడంతో పాటు అధిక సంఖ్యలో హుండీలో కానుకలు కూడా వేశారట.ఈ విషయం పైన రామ మందిరం నిర్మాణం ట్రస్ట్ కార్యాలయం ఇంచార్జ్ గుప్తా పలు విషయాలను తెలియజేశారు.

రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో గత 10 రోజుల్లో సుమారు ₹8 కోట్లు విరాళాలు హుండీల్లో జమ అయ్యాయని, ఆన్లైన్లో సుమారు ₹3.50 కోట్లు అందాయని తెలిపారు.స్వామి కొలువై ఉన్న గర్భగుడి ముందు దర్శన మార్గానికి సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల బాక్స్‌లను ఉంచామని, అందులో భక్తులు విరాళాలు వేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో కూడా ప్రజలు విరాళాలు ఇస్తున్నారని తెలిపారు.
ఇక ఈ విరాళాలు లెక్కింపు కార్యక్రమం 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు సహా 14 మంది ఉద్యోగుల బృందం ఆధ్వర్యంలో జరుగుతుంది. విరాళాలు లెక్కించడం అంతా సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నాయని గుప్తా తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో రామ మందిరం నుంచి భక్తులు తాకిడి పెరిగి మరింత అధిక సంఖ్యలో విరాళాలు వస్తాయని అంటున్నారు.






కథ:














ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/జి బృందావన కాలనీ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పలు రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కమర్షియయల్ గా హిట్ అయ్యింది. ఈ మూవీకి గాను రవి కృష్ణ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ మూవీ సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఈ మూవీ తరువాత రవి కృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వరుస అపజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు పొందడంలో కూడా విఫలమయ్యాడు. తెలుగు, తమిళం భాషల్లో కలిపి సుమారు 8 సినిమాలలో హీరోగా నటించాడు. వీటిలో ‘7/జి బృందావన కాలనీ’ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2011 తరువాత రవి కృష్ణ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రవి కృష్ణ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల 7/జి బృందావన కాలనీ సీక్వెల్ రాబోతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవి కృష్ణ బరువు తగ్గించుకుని, సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ లో పేటీఎమ్ కూడా ఒకటి. డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటీఎమ్ వాటా 16 నుండి 17 శాతం ఉంటుంది. బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పేటీఎం ఆడిట్ రిపోర్ట్ తో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల రిపోర్ట్స్ ప్రకారం, తరచుగా పేటీఎం రూల్స్ ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అందువల్ల బ్యాంకుల నియంత్రణ చట్టంలో ఉన్న ’35ఏ’ రూల్ ప్రకారంగా, ఫిబ్రవరి 29 అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో లావాదేవీలు, వ్యాలెట్, క్రెడిట్ డిపాజిట్, ఫాస్టాగ్ టాప్అప్లు ఆపేస్తున్నాము.
కస్టమర్ల బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, ఉపఎగిన్చుకోవడానికి పూర్తిగా పేటీఎం సహకరించాలి. అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫాస్టాగ్‌లలో ఉన్న డబ్బును విత్‌డ్రా, లేదా వాడుకోవడానికి కస్టమర్ల పై ఎటువంటి ఆంక్షలు ఉండవు’’ అంటూ ఆర్బిఐ ప్రకటనలో వెల్లడించింది. అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు దానిని వినియోగించలేరు. మార్చి 15 లోగా నోడల్ అకౌంట్‌ను కూడా సెటిల్ చేయాలని ఆర్బీఐ పేటీఎంను కోరింది.