తెలుగు సినిమా ఇండస్ట్రీలో గయ్యాళి అత్త అంటే గుర్తొచ్చే వ్యక్తి సూర్యకాంతం గారు. ఆ పాత్రని అంత బాగా పోషించేవారు. సూర్యకాంతం గారు కానీ స్వతహాగా చాలా మంచివారు. సినిమాలో తను పోషించే పాత్రలకి, బయట స్వభావానికి అస్సలు సంబంధం ఉండదు అని అంటారు. అంత మంచి మనిషి ఆవిడ. సూర్యకాంతం గారు తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ దగ్గర ఉన్న వెంకటకృష్ణరాయపురంలో, అక్టోబర్ 28వ తేదీ 1924 లో జన్మించారు. తన తల్లిదండ్రులకు సూర్యకాంతం గారు 14వ సంతానం. సూర్యకాంతం గారికి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పాటలు పాడడం, డాన్స్ చేయడం వంటివి నేర్పించారు.
సూర్యకాంతం గారు హిందీ సినిమా పోస్టర్లు చూస్తూ పెరిగారు. దాంతో అవి చూసి తనకి కూడా నటి కావాలి అని అనిపించింది. అందుకు చెన్నైకి వెళ్లారు. జెమినీ స్టూడియోస్ నిర్మించిన చంద్రలేఖ అనే సినిమాలో డాన్సర్ పాత్రలో మొదటిసారి నటించారు. తర్వాత ధర్మాంగద అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సూర్యకాంతం గారు మాటలు రాని ఒక వ్యక్తి పాత్రలో నటించారు. ఆ తర్వాత నారద నారది అనే సినిమాలో సహాయ పాత్రలో నటించారు. కానీ అవేవీ కూడా సూర్యకాంతం గారికి సంతృప్తి ఇవ్వకపోవడంతో జెమిని స్టూడియోస్ నుండి బయటికి వచ్చేసారు.
ఆ తర్వాత బొంబాయికి వెళ్దాము అని అనుకున్నా కూడా, ఆర్థికంగా అంత స్తోమత లేకపోవడంతో వెళ్లలేదు. అప్పుడే గృహప్రవేశం అనే ఒక సినిమాలో నటించారు. ఆ తర్వాత సౌదామిని అనే సినిమాలో హీరోయిన్ పాత్ర వచ్చింది. కానీ ఆ సమయంలో సూర్యకాంతం గారికి కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అయ్యింది. దాంతో ఆ సినిమాలో నటించలేదు. ఆ తర్వాత కోలుకొని సంసారం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో గయ్యాళి అత్త పాత్రలో సూర్యకాంతం గారు నటించారు. ఆ తర్వాత సూర్యకాంతం గారికి చాలా మంచి పేరు వచ్చింది.
దాంతో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లారు. సూర్యకాంతం గారికి 1950లో పెద్దిబొట్ల చలపతిరావు గారితో పెళ్లి జరిగింది. పెద్దిబొట్ల చలపతిరావు గారు హైకోర్టులో జడ్జిగా పనిచేసేవారు. డిసెంబర్ 17వ తేదీ 1996లో సూర్యకాంతం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే సూర్యకాంతం గారు చివరి రోజుల్లో ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్ట్ చేశారు. సూర్యకాంతం గారు ఈ ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ చెప్తున్నారు. తన కోడలికి పని చెప్తే, చేయకపోవడంతో తాను ఏం చేశాను అని ఒక డైలాగ్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది ప్రేక్షకులు కూడా సూర్యకాంతం గారిని గుర్తు చేసుకుంటున్నారు.
watch video :
ALSO READ : కల్కి 2898 AD కంటే ముందే… “దీపికా పదుకొనే” తెలుగు సినిమాలో నటించారా..? ఏ సినిమా అంటే..?