బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కి వెళ్ళిన వారికి క్రేజ్, పాపులారిటీ, డబ్బు వస్తాయనే విషయం కూడా తెలిసిందే. చాలామంది ఈ షోలో పాల్గొనడం ద్వారా డబ్బు, ఇమేజ్ వస్తుందని కలలు కంటుంటారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తాము ఆశించిన ఇమేజ్, డబ్బు వస్తుంది.
ఇక ఈ షోకి వెళ్లి అప్పటివరకు వారికున్న ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేసుకుని బయటికి వచ్చినవారు ప్రతి సీజన్ లో ఉంటారు. రీసెంట్ గా ముగిసిన 7 సీజన్ ఫైనల్ తరువాత జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్‌కి వెళ్లి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవారే కాకుండా, ఆ షోకి వెళ్లాలనే కోరికతో డబ్బులిచ్చి మోసపోయిన ఇన్సిడెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ షోకి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నప్పటికీ, షో చుట్టూ అదే స్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే తరువాత చోటు చేసుకున్న ఘటనలు, రన్నర్ పై దాడి, విజేత అరెస్ట్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సీజన్ 7లో పాల్గొనాలనే ఆశతో యాంకర్ స్వప్న చౌదరి డబ్బు ఇచ్చియానట్టు, కానీ తనకౌ ఛాన్స్ ఇవ్వలేదని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ” నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని, యాంకర్ అండ్ యాక్టర్. మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే సినిమాల ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది.
కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్న గా, యాక్టర్ స్వప్నగా చాలామందికి తెలుసు. నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను నిద్రపోయినప్పుడు కనే కలలో సైతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్టే కలకంటాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ చాలా ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి, నా దగ్గర నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వేసుకునే క్యాస్ట్యూమ్స్‌కి డబ్బులు కావాలి అని, తమ్మలి రాజు అనే వ్యక్తి రెండున్నర లక్షలు తీసుకున్నారు. అందుకు సంబంధించి బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ ఇచ్చారు. గత జూన్ లో డబ్బు ఇచ్చాను.
లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు కన్ఫామ్ అన్నారు. కానీ వేరే వాళ్ల నేను ట్రై చేస్తానని చెప్తే, అవసరం లేదు. నేనే పంపిస్తానని అన్నారు. డబ్బు ఎందుకని అడిగితే, పీఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం, కాస్ట్యూమ్స్ కి అని చెప్పాడు. డబ్బు తీసుకోవాడమే కాకుండా, నాతో ఫొటో షూట్ చేయించారు. అందుకు రూ. 25 వేల వరకు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బు ఇస్తే, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నానంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ రాలేదు కదమ్మా, సీజన్ 8లో పంపిస్తానని చెప్పి డబ్బు ఇవ్వలేదు. కానీ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చారు.
ఇందులో సీజన్ 7 లో పంపలేకపోయాను. డబ్బు మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని రాయడం జరిగింది. ఇందుకోసం ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. జనవరి 6న ఇస్తానని చెప్పాడు. ఆ రోజున కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో.. ప్రెస్ మీట్ పెడతావ పెట్టు అని మాట్లాడాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్లు ఇటువంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను గమనించండి. బిగ్ బాస్‌కి పంపిస్తాం అంటూ డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నారు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సీజన్ 8 లో అయినా నేను వెళ్ళాలి. నా అమౌంట్ నాకు రావాలి” అంటూ స్వప్న చౌదరి తన ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: GUNTUR KAARAM DIALOGUES IN TELUGU, గుంటూరు కారం సినిమా డైలాగ్స్


ఒక రైతుగా సాధారణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందడంతో భావోద్వేగానికి లోనయ్యాడు అతడు. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో 1992 డిసెంబర్ 2 వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు అయోధ్యలో ఉన్న మహ్మద్ హబీబ్ తనతో ఉన్న వారితో కలిసి కరసేవకుడిగా కొట్లాడాడు. ఆ సమయంలో మహ్మద్ హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తించిన అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అతనికి ఆహ్వానం పంపించింది. హిందువుల ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఒక ముస్లిం కి ఆహ్వానం పంపడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. భారతదేశం ఎందుకు మత సామ్రాస్య దేశమో అర్థం అవుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అతడు, ఖలేజా లాంటి క్రేజీ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్, మూడు పాటలు, పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి.
ఆదివారం నాడు సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య గుంటూరు కారం ట్రైలర్ విడుదల చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే యూట్యూబ్ లోనూ విడుదల అయ్యింది. రెండు నిమిషాల, 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మహేష్ పాత్రను, బాడీ లాంగ్వేజ్ హైలెట్ అయ్యే విధంగా చూపించారు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫిదా చేశాడు. మహేష్ డైలాగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్లు శ్రీలీల , మీనాక్షిల గ్లామర్ సైతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రారంభంలో ప్రెస్ మీట్ లో రమ్యకృష్ణను ఒక జర్నలిస్ట్ ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కనిపించింది.
అతని వాయిస్ త్రివిక్రమ్ వాయిస్ లా ఉంది. దాంతో ఈ మూవీలో త్రివిక్రమ్ కనిపించే ఛాన్స్ ఉందమో అని టాక్. అంతే కాకుండా మహేష్ పాత్ర చిన్నప్పుడు నిప్పు రవ్వ కంట్లో పడినట్టుగా కనిపించింది. ఒకవేళ మహేష్ కంటికి సమస్య ఏదైనా ఉందన్నట్టుగా చూపిస్తారేమో, రెండు సీన్స్ లో మహేష్ కన్ను ఒకటి మూసి చూడడం కనిపించింది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ ఫైట్ సీన్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్న ఫీల్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అంటూ ఇప్పటికే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూవీలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది.





















లక్కీ ప్రవర్తన వల్ల ఇతర స్టూడెంట్స్ ఇబ్బందులు పడతుండడంతో రాఘవరెడ్డి ఆమెకు పనిష్మెంట్ ఇస్తాడు. దాంతో లక్కీ రాఘవరెడ్డి పై కోపం పెంచుకుంటుంది.ఆ తరువాత లక్కీ తల్లి దేవకీ (రాశీ) రాఘవరెడ్డికి కనిపిస్తుంది. ఆమెను చూడగానే రాఘవ రెడ్డి భయపడి, పరిగెడుతుంటాడు. లక్కీ తన పుట్టినరోజుకు ముందు అదృశ్యం అవుతుంది. రాఘవరెడ్డి లక్కీని కిడ్నాప్ చేశాడని దేవకి ఆరోపిస్తుంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేసారు? దేవకి రాఘవరెడ్డిని సందేహించడానికి కారణం ఏమిటి?అసలు దేవకిని చూడగానే రాఘవరెడ్డి ఎందుకు భయపడతాడు? ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది మిగిలిన కథ.
రివ్యూ :
హీరోకు మొదటి సినిమా అయినా ఎలివేషన్స్ ఎక్కువే ఇచ్చారు. హీరో పాత్ర ఓ వైపు కేసులను సాల్వ్ చేస్తూ, మరో వైపు ప్రొఫెసర్‌గా పనిచేస్తుండడం బాగానే చూపించారు. నందిత శ్వేత సీన్స్, ఆమెతో ఉండే శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఒకే అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం ఇలాగే సాగుతుంది. సెకండాఫ్ కీలకం, రాఘవ రెడ్డి ఎవరు, దేవకీతో ఆయనకున్న సంబంధం ఏమిటనేది చూపించాడు.
రాఘవ రెడ్డిగా శివ కంఠంనేని చక్కగా నటించాడు. కొత్త యాక్టర్ అనే భావన ఎక్కడా కలగలేదు. ఎమోషనల్ సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాలలో తన నటనతో మెప్పించాడు. సీనియర్ హీరోయిన్ రాశీ చాలా రోజుల తర్వాత వెండితెర పైన కనిపించింది. తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. లక్కీగా నందిత శ్వేత పర్లేదు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ, ఫేమ్ వాసుకీ ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ 90’s’. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా, రాజశేఖర్ మేడారం నిర్మాతగా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ జనవరి 5 నుండి ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో నాటి వాసుకీ మధ్య తరగతి గృహిణి రాణిగా సహజంగా నటించింది. ఆమె కాకుండా ఆ పాత్రే కనిపించేలా నటనలో ఒదిగిపోయారు.
ఆమెను చూస్తే 90ల పిలల్లకు వారి తల్లి జ్ఞాపకం వస్తుంది. భర్తతో ఆర్ధిక ప్రణాళిక, వారి ఇంట్లో పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు ప్రతి గృహినికి తమను చూసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ముఖ్యంగా తాను చేసే పనుల గురించి చెప్పే సీన్ అయితే ప్రతి హౌజ్ వైఫ్ కి కనెక్ట్ అవుతుంది. ఆ సీన్ లో “పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి పోతావు. మళ్ళీ కబోర్డ్ లోకి ఎలా వస్తుంది. నేను ఉతుకుతున్నాను. అందరు బాత్రూమ్ వాడుతారు. శుభ్రంగా ఉంటున్నాయా? ఏయవరు క్లీన్ చేస్తున్నారు. నేను చేస్తున్నాను. పల్లాల్లో అందరు తినేసి ప్లేట్లు పడేసి పోతారు. మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను. వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను. గిన్నెలు తోముతున్నాను, ఇల్లంతా శుభ్రంగా పెడుతున్నాను.
అయినా ఎవరు నీళ్ళు అని ఎక్కడి నుండి కేకేసినా, నేనే నీళ్ళు తెచ్చి ఇవ్వాలి. మీకు ఏం తక్కువ చేసిన, పక్కింటిలో ఉండేవారందరు, ఆడవాళ్ళు టివి సీరియల్స్ చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని చెప్పి, కేబుల్ కనెక్షన్ కూడా పీకేసావు. నాకు టివి కూడా లేదు. మీరందరు ఇంటికెప్పుడు వస్తారని కూర్చుని, ఎదురుచూస్తుంటాను. మీకాంతా అర్ధం కాదు. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు. కానీ అవి లేకుంటే రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ, పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుంటే మీకు లైఫే లేదు.” వంటి డైలాగ్స్ చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతాయి.