యంగ్ హీరో నితిన్ శ్రీలీలా జంటగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఇటీవల విడుదల అయింది.ఈ సినిమాకి మంచి స్పందన లభించినప్పటికీ కూడా కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. పోటీగా నాని హాయ్ నాన్న సినిమా ఉండడం అలాగే ముందు వారం రిలీజైన యానిమల్ సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగడంతో నితిన్ సినిమాకి ప్రతికూలంగా మారింది. కామెడీ బాగా వర్కౌట్ అయిందని మౌత్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం దానికి తగ్గట్టుగా లేవు.

అయితే ఈ చిత్రం ద్వారా యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రతో రియంట్రీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం రాజశేఖర్ కి నితిన్ తండ్రి నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి ఏకంగా రెండు కోట్ల రూపాయల చెల్లించారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇది మామూలుగా చూసుకుంటే చాలా ఎక్కువ,కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెమ్యూనిరేషన్ ఇచ్చారట. అయితే సినిమాలో రాజశేఖర్ పాత్ర కూడా బాగానే వర్కౌట్ అయింది. కాకపోతే కలెక్షన్లు సరిగ్గా రాకపోవడంతో ఈ సినిమా హిట్ కేటగిరీలోకి వెళ్లలేకపోయింది. రానున్న రోజుల్లో మోస్తారు కలెక్షన్లు సాధించి బ్రేక్ ఈవెన్ అయితే తప్ప ఈ సినిమా నితిన్ కి ప్లస్ అవ్వదు.






1. మహేష్ బాబు:
2. రామ్ చరణ్:
3. వరుణ్ తేజ్:
4. మెగాస్టార్ చిరంజీవి:
5. అఖిల్ అక్కినేని:
6. అక్షయ్ కుమార్:
7. షారుఖ్ ఖాన్:
8. ముస్తఫా బర్మావాలా:
9. అమీర్ ఖాన్:
భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, ఘోర పరాజయం పాలైంది. దీంతో అమీర్ ఖాన్ అభిమానులకి క్షమాపణలు చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బుల్లితెర పై సత్యమేవ జయతే అనే టాక్ షోతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, సామాజిక సమస్యల పై రియాలిటీ టాక్ షోను మొదలుపెట్టాడు. సత్యమేవ జయతే మొదటి సీజన్ 2012లో మే 6న ప్రసారం అయ్యింది. ఈ షో డీడీ నేషనల్, స్టార్ వరల్డ్ తో పాటుగా మొత్తం పది ఛానెల్స్ లో ప్రసారం అయ్యింది. ఈ షోలో భారతదేశంలో ప్రబలంగా ఉన్న ఆడపిల్లల భ్రూణహత్యలు, పిల్లల లైంగిక వేధింపులు, అత్యాచారం, పరువు హత్యలు, గృహ హింస లాంటి సున్నితమైన సామాజిక సమస్యల పై దృష్టి సారించింది.
అంటరానితనం, వివక్ష, ప్రత్యామ్నాయ లైంగికతలను అంగీకరించడం, విషపురుషత్వం, మద్యపానం మరియు నేర రాజకీయాల మెడికల్ మాఫియా గురించి ఈ షోలో చర్చించారు. యువత వారి లక్ష్యాలను సాధించడానికి, ప్రేక్షకులను ప్రోత్సహించడానికి గొప్ప విజయాలు సాధించి, గుర్తింపు పొందని వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ షో సాగింది. పౌరులకు వారి దేశం గురించిన సమాచారంలో సాధికారత కల్పించడం మరియు చర్య తీసుకోవాలని వారిని కోరడం కూడా దీని లక్ష్యం. ఈ షో హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు లాంటి 8 భాషలలో ఏకకాలంలో ప్రసారం చేయబడింది. అందరికి రీచ్ కావడానికి వీలుగా ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ప్రసారం చేశారు.
ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. సత్యమేవ జయతే మొదటి సీజన్ కు 165 దేశాల నుండి బిలియన్ డిజిటల్ ఇంప్రెషన్లను పొందింది. పలు దేశాలలో వ్యూయర్స్ నుండి ప్రతిస్పందనలతో, మిలియన్ల మంది ప్రజలు ఈ షోకు మద్దతు ఇచ్చారు. రెండో సీజన్‌ను 600 మిలియన్ల మంది ఇండియన్స్ చూశారు. అయితే ఈ షో కొన్ని కారణాల వల్ల ఆపేశారు. ఎందుకనేది తెలినప్పటికి సమాజంలో జరిగే ఎన్నో విషయాల గురించి ఈ షో మాట్లాడింది. ఈ షోకి మరిన్ని సీజన్స్ వస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.


‘ఓ మై బేబీ’ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి గుంటూరు కారం యూనిట్ మీద మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం దానిపై పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ వార్ మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ చేసారు. ఈ ట్రోలింగ్ పై నిర్మాత నాగవంశీ రెస్పాండ్ కావడం మరింత హాట్ టాపిక్ కి దారి తీసింది. ఆ తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేసాడు. ఇలా ఇద్దరు వెనక్కి తగ్గడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు క్షమాపణ చెప్పడమే అంటూ ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్ లో “నాగవంశీ తన ట్వీట్లను తొలగించాడు. అతను ఫ్యాన్స్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేశాడు. మహేష్‌బాబు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో ఉపయోగించిన భాషతో అప్ సెట్ అయ్యాడు. అది చాలా తప్పు అనేలా చెప్పారు. మహేష్ అన్నకి తన ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అనేది అర్దమైందా? వర్క్ తో మాట్లాడదాము, ఇంప్రెస్ చేద్దాము. వాళ్ళు చెప్పారు అంటే వూరికే చెప్పరు. ఏదైనా అని ఉంటే నా తరుపున క్షమించండి, రామజోగయ్య గారు, తిరిగి వర్క్ కు రండి. నెక్ట్స్ పాట అదిరిపోయేలా రాయండి అనేలా చెప్పారంట.
ప్రొడక్షన్ హౌస్ మరియు నిర్మాతలు తెలుసుకోవలసిన విషయం, ఎండ్ ఆఫ్ ద డే అభిమానులే అంతా, వాళ్లకోసమే సినిమాలు తీసేది అనే స్టేట్మెంట్ ఉంటుంది ఏ హీరో నుండి అయినా, అట్లాంటిది వారిని జడ్జ్ చేయవద్దు. మీ చెత్త ప్రవర్తన వల్ల మా హీరో మాకు సారీ ఫిల్ అవడం మాకు ఇష్టం ఉండదు. మా అన్నయ సినిమా అండి.సెలెబ్రేషన్స్ మేము చేసుకుంటాము అంటే అర్ధం, సెలెబ్రేషన్స్ చేసేలా సాంగ్స్ ఇవ్వాలి అని, బలవంతంగా రుద్దడం కాదు. ఓవర్ ఆల్ గా ఇక్కడితో పంచాయితీ అయిపొయింది. అదిరిపోయే కంటెంట్ మీరు మాకు ఇవండి. దాన్ని నెక్స్ట్ లెవల్ సెలెబ్రేషన్స్ మేము చూసుకుంటాము” అని చెప్పుకొచ్చారు.