యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈనెల 22వ తారీఖున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని భారీ ఎత్తున మొదలు చేస్తున్నారు. నైజంలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ గ్రాండ్ విడుదల చేస్తుంది.
అయితే సలార్ మూవీకి సంబంధించి తెలంగాణలో మొదటి టిక్కెట్ ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొనుగోలు చేశారు. మైత్రి మూవీస్ సంస్థాజనేత నవీన్ ఈ టికెట్ ను రాజమౌళికి అందించారు. ఈ కార్యక్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , పృధ్విరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు.

అయితే సలార్ కి ఉన్న క్రేజ్ నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టికెట్ల కోసం ఇప్పటికే పోటీ నెలకొంది. టికెట్ల రేటు పెంపు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాతలు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అలాగే బెనిఫిట్ షోస్ కోసం కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇప్పటికే సెన్సార్ నుండి వచ్చిన టాక్ ప్రకారం అయితే సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు













అమర్ దీప్‌ని కొట్టిన తరువాతే అన్నపూర్ణ స్టుడియోస్ నుండి వెళ్తామని పబ్లిక్‌గా యూట్యూబ్ ఛానల్స్ తో చెప్పిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, అన్నట్టుగానే ఫినాలే షో ముగిసిన తరువాత అర్ధరాత్రి బయటికి వచ్చిన అమర్ దీప్ మరియు అతని కుటుంబం పై దాడి చేశారు. వారి కారుని కూడా ధ్వంసం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్, తల్లి, అతని భార్య, ఫ్రెండ్ నరేష్ లొల్ల,డ్రైవర్ ను భయభ్రాంతులకు గురి చేశారు.
బూతులు తిడితూ, కారును అద్దాలను పగులగొట్టారు. అమర్ దీప్‌ని బయటకు లాగాడానికి ప్రయత్నం చేశారు. దాంతో అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళన పడ్డారు. అరగంట పాటు జరిగిన దాడిలో వదిలేయమని అమర్ తల్లి, ఫ్రెండ్ దండం పెట్టినా వినలేదు. కారుని ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్‌కి, తల్లి, భార్యకి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అమర్ దీప్ కారునే కాకుండా, గీతూ రాయల్, అశ్విని కార్లను, ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాలను కూడా పగుల గొట్టారు. గీతూ రాయల్ ఈ విషయం పై కేసు పెట్టింది.
గీతూ, అశ్విని సోషల్ మీడియాలో దాడి గురించి పోస్ట్ చేశారు. అమర్ దీప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసినవారు ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఇంత గొడవ అవలేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..

4.
5.
6.
7.
8.