కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల లోను ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు ముఖ్యమంత్రులు.
View this post on Instagram
ఇది ఇలా ఉండగా… ‘నందిని’ సీరియల్ ఫేమ్ నిత్యారామ్ మాత్రం జనతా కర్ఫ్యూ సమయంలో కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం అంటూ వింతగా పోస్ట్ చేసింది. ఆస్ర్టేలియాకు చెందిన గౌతమ్ అనే బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్న నిత్య రామ్ ‘కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం’ అంటూ కొటేషన్ పెట్టి మాస్కులు ధరించి ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.