కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది . సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కరోనా గురించి కలవరపడుతున్నారు. మన దేశంలో కరోనా సోకుతున్న వారి సంఖ్యరోజురోజుకి పెరుగుతుంది. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి శుభ్రత ముఖ్యం అని డాక్టర్లు సూచించిన విషయం విధితమే. దాంతో శానిటైజర్లు, మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది .
ఇదే అవకాశం అని అమాంతం మాస్కులు, శానిటైజర్ల రేట్లు పెంచేశారు. మాస్కుల ఖరీదు టూ మచ్ గా పెంచేయడంతో ఇంట్లో ఉన్న ఖర్చీప్, స్కార్ఫ్ లనే మాస్కులుగా వాడుతున్న పరిస్థితి. దాంతో పాటు మార్కెట్లో శానిటైజర్ల కొరత ఏర్పడింది. ఇక్కడ శానిటైజర్ లు వాడటం మంచిదే…కానీ దాని వల్ల ఓ ప్రమాదం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతుంది.
శానిటైజర్‌ను ఉపయోగించిన తర్వాత గ్యాసు స్టవ్ అంటించరాదు. ఇది ఆల్కహాల్ తో తయారై నందున, నిప్పు అంటు కోవడం చాలా సులభం, మొదట మీ చేతులను సబ్బుతో కడగాలి, తరువాత వంట చేయాలి. అంటూ ఓ మెసేజ్ వైరల్ అవుతుంది. కొంతమంది ఇది నిజం అని నమ్ముతుంటే. కొంతమంది ఇది ఫేక్ అంటున్నారు. నిజానికి శానిటైజర్ ని మనం చేతులకు రుద్దుకున్నప్పుడు దాంట్లో ఉండే ఆల్కాహాల్ ఆ వేడికే ఆవిరి అయిపోతుందిఅని కొందరు అంటున్నారు. బర్నింగ్ కి చాలా అంటే చాలా .౦౦౦ ౦౦౦౦ 1 % కూడా ఛాన్స్ లేదు అని కొందరు అంటున్నారు.
శానిటైజర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ముందుగా… 100 మి.లీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ చొప్పున గ్లిజరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఖాళీ స్ప్రే బాటిల్ లేదా డిస్పెన్సింగ్ బాటిల్లో పోసి శానిటైజర్‌గా వాడుకోవచ్చు.శానిటైజర్ తయారీకి వినియోగించే లిక్విడ్స్ నగరంలోని అబిడ్స్ తిలక్‌రోడ్‌లోని ల్యాడ్ కెమికల్స్ విక్రయించే దుకాణాల్లో లభిస్తాయట.