“గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి” ఎంతో మంది తండ్రీ కూతుళ్లను ఆకట్టుకుంది ఈ పాట..అంతేకాదు డాడీ సినిమాలోని చిరంజీవికి, తన కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కి మధ్య నడిచిన సన్నివేశాలన్ని ఇప్పటికి ఫ్యామిలి ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి.. మరి ఆ సినిమాలో అక్షర, ఐశ్వర్యగా ద్విపాత్రాభినయం చేసిన ఆ చిన్నారి తర్వాత సినిమాల్లో కనిపించలేదు..డాడీ సినిమా వచ్చి ఇరవై ఏళ్లు అయింది..మరిప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉందో తెలుసా?
నిజానికి చైల్డ్ ఆర్టిస్టులని వారి నటనతోనో, వారి పాత్రల పేరుతోనో ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు చాలామంది..అలా డాడీ సినిమాలో నటించిన చిన్నారి కూడా అక్షరగానే ఎక్కువమందికి తెలుసు..కానీ ఆ చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా.. తెలుగమ్మాయి కానప్పటికి పాత్రకి తగ్గట్టుగా ముఖంలో భావాల్ని పలికించగలిగింది..చిరుతో కలిసి నటించిన సన్నివేశాల్లో అయితే సొంత తండ్రీ కూతుళ్లా అనిపించేలా చేసింది.
అప్పట్లో ఆ అమ్మాయి ఇండస్ట్రీ వారికి చెందిన కూతురని, చిరంజీవి ఫ్యామిలికి దగ్గర వాళ్ల అమ్మాయని అందుకే చిరుతో అంత ఈజ్ గా నటించేసిందని రకరకాల టాక్స్ వచ్చాయి..కానీ నిజానికి ఆ అమ్మాయి నార్త్ ఇండియా ఫ్యామిలికి చెందిన అమ్మాయి..ఊరు ముంబాయి..ప్రస్తుతం యుకెలో ఉంటుంది..డాడీ తర్వాత మరో హింది చిత్రంలో నటించింది..తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు..
ఇటీవల అనుష్క మల్హోత్ర ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అందరూ అవాక్కయ్యారు.. ఆ చైల్డ్ ఆర్టిస్టేనా ఇప్పుడిలా హీరోయిన్ లా ఇంతందంగా ఉంది అని ఆశ్చర్యపోయారు. సినిమాల్లో ఎందుకు నటించట్లేదు అని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు.కానీ కొందరుంటారు ఇండస్ట్రీ ఊబిలో చిక్కుకుపోకుండా తమ పని తాము చేసుకునేవాళ్లు..అలాంటి కోవకి చెందిందే అనుష్క మల్హోత్రా..