స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తరువాత సోషల్ మీడియా హవా చాలానే పెరిగింది. ఎక్కడెక్కడో ఉండే మనుషులను, వారి ప్రతిభని మనం సోషల్ మీడియా ద్వారా తేలికగా తెలుసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు స్టేజి మీద పెర్ఫామ్ చేసే అవకాశం వస్తేనే వారి టాలెంట్ ఏంటో బయటి జనాలకు తెలిసేది. అది కూడా ఆ చుట్టూ పక్కల గ్రామాల వరకే వారి టాలెంట్ ఏంటో తెలిసేది.
కానీ, నేడు స్మార్ట్ ఫోన్లలోకి కెమెరాలు, వీడియోస్ తీసుకునే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక.. క్షణాల్లో ప్రపంచం మొత్తానికి తమ టాలెంట్ ను చూపించుకునే అవకాశం అందరికీ లభిస్తోంది.
https://www.instagram.com/p/CchFCOGJLeL/
అయితే, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అవసరం ఉన్నంత వరకు వాడుకుంటే ఏ సదుపాయం అయినా లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు వచ్చిన తరువాత చాలా మంది తమ ప్రతిభను చూపించుకోవడానికి వీటిని వేదికగా చేసుకుంటున్నారు. అంతే కాదు, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా గడిస్తున్నారు. వారిలో ప్రియాంక రెడ్డి కూడా ఒకరు.
https://www.instagram.com/p/Cc9XJq5pHtX/
ఇంస్టాగ్రామ్ వాడేవారికి ప్రియాంక రెడ్డి సుపరిచితమే. ప్రియాంక రెడ్డి @ ఎలిగెంట్ డాన్సర్ అన్న ID తో ఉండే ఈమె ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు డాన్స్ అభిమానులు ఫిదా అయిపోతారు. ఆమె అంత అద్భుతంగా డాన్స్ చేస్తారు. బాగా పాపులర్ అయిన సినిమా వీడియో సాంగ్స్ ను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ.. వాటికి తగ్గట్లే కాస్ట్యూమ్స్ ను ధరించి.. ఆ వీడియో లో హీరోయిన్స్ నర్తించినట్లే ఆమె కూడా నర్తింస్తుంటారు.
https://www.instagram.com/p/CcjvD7QpO1u/
ఆమె వీడియోస్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు. ఆమె ఇన్‌స్టా అకౌంట్ ను 21.3 వేల మంది ఫాలో అవుతున్నారు. అచ్చం సినిమాల్లో లాంటి కాస్ట్యూమ్స్ ను ఉపయోగించి ఆమె చేసే డాన్స్ ను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే ఆమెకు ఇంస్టాగ్రామ్ లో కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆ వైరల్ వీడియోస్ ను మీరు కూడా ఇక్కడ చూసేయచ్చు.
Watch Videos:
https://www.instagram.com/p/CcpDBieJLC0/









1. ప్రేమ పెళ్లి:
2. పెద్దలు కుదిర్చిన పెళ్లి:
ప్రేమించి వివాహం చేసుకున్నా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా కూడా ఆ బంధం అనేది నిలబడాలంటే అది ఆ భార్యా భర్తల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య ఉండే నమ్మకం, ప్రేమానురాగాలు పెళ్లి నిలబడడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ క్రింది వీడియో చూడండి..
ధోనీ తన ఆటతో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని విధంగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయినప్పటికీ, ధోనీ ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ధోనీకి సంబంధించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా ధోనీకి స్వంత అన్న ఉన్నాడని, అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, ధోని తన అన్నను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతని గురించి ధోని బయోపిక్ గా వచ్చిన ‘ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ’ లో కూడా చూపించలేదని అంటున్నారు.
ధోనికి ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు నరేంద్ర సింగ్ ధోని. ధోనీ కన్నా పదేళ్ళు పెద్దవాడు. కొంతకాలం క్రితం ధోని రాంచిలో ఉన్న తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం ధోనిని నరేంద్ర కలిశాడని ది క్రిక్టైమ్ తెలిపింది. నెటిజెన్లు చేస్తున్న కామెంట్స్ కు నరేంద్ర సింగ్ ధోని గతంలో ఒక ఇంటర్వ్యూతో ధోనీ ఫ్యాన్స్ జవాబు ఇస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలో నరేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, ‘మహీ చిన్నతనం, యువకుడిగా కష్టాలు పడ్డ టైమ్ లో నేను ధోనీకి సాయం చేయలేదు. అతను క్రికెటర్ గా ఎదగడంలో నా ప్రమేయం ఏం లేదు. మహీ నాకన్నా పది సంవత్సరాలు చిన్నవాడు. తను తొలిసారి బ్యాట్ పట్టుకునే టైమ్ కి రాంచి విడిచి ఉన్నత చదువుల కోసం కుమాన్ యూనివర్సిటీకి వెళ్ళాను. కానీ మహీకి కొన్నింటిలో నైతికంగా అండగా ఉన్నా, వాటన్నిటినీ మూవీలో ఇరికించాల్సిన పని లేదు. నిజానికి ఈ మూవీ మహీ గురించి, అతడి ఫ్యామిలీ గురించి కాదు’’ అని చెప్పుకొచ్చారు.
నరేంద్ర సింగ్ ధోనికి పాలిటిక్స్ అంటే ఆసక్తి అని తెలుస్తోంది. అతను 2013 నుండి సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగుతున్నాడు. దానికి ముందుగా బిజెపిలో ఉండేవారని సమాచారం. నరేంద్ర 2007లో వివాహం చేసుకోగా, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు నేషనల్ మీడియా కథనాలు తెలుపుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ అంజు(34), పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం అయ్యింది. వీరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ళు సాగిన తరువాత ఇద్దరు కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అంజు,భర్త పిల్లలను విడిచి పెట్టి, ప్రేమించిన వ్యక్తి కోసం సరిహద్దులు కూడా దాటి, జూలై 21న పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్‌లో ఉండే దీర్ సిటీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంలో అంజు భర్త అయిన అరవింద్ మాట్లాడుతూ, తన భార్య అంజు జైపూర్‌కు వెళ్తున్నాననే వంకతో గురువారం నాడు ఇంటి నుండి వెళ్లినట్టు వెల్లడించారు. అయితే అంజు పాకిస్థాన్‌కు వెళ్లినట్టుగా తెలిసిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె స్నేహితుడిని కలవాలని తెలిపి, ఇంటి నుండి వెళ్లిపోయిందని తెలిపారు. ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ఆమె భర్తకి ఫోన్ చేసి, ఆమె లాహోర్‌లో ఉన్నానని, 2, 3 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని అంజు చెప్పినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
