తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు జయవాణి. చిన్నప్పటి నుండి కూడా సినిమాలంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే సినీ ఇండస్ట్రీ లోకి రావడం.. సినిమాల్లో నటించడం జరిగింది. నిజంగా సినిమాలంటే ఇష్టం అయిన వాళ్లు ఎలాంటి పాత్రనైనా చేసేస్తారు.
అలానే ఏ అవకాశం వచ్చినా సరే ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటారు. జయవాణి కూడా అంతే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు. విలన్ పాత్రలు చేసే ఆడవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ విలన్ పాత్ర పోషించడం, అందరిని మెప్పించడం జయవాణికి కొత్త కాదు.
తన తండ్రి కూడా సినిమాల్లోకి రావడానికి ఆమెకు ఎంతగానో సపోర్ట్ చేశారని ఆమె చెప్పారు. అలానే వ్యక్తిగత జీవితం గురించి ఆమె చెబుతూ… సినిమాలు అంటే నాకు పిచ్చి అందుకనే సొంత మామయ్య అయిన గుమ్మడి చంద్రశేఖర రావు కి ఇచ్చి పదవ తరగతిలోనే అంటే 13 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసేసారు అని ఆమె చెప్పారు.