ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్ సినిమా నాగార్జునకి మంచి హిట్ ని అందించింది. ఆ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఒకే లక్షణాలు ఉండి ఏకకాలంలో ఒకేలాగ ప్రవర్తించే కవలల కధ ఆధారంగా దీనిని రూపొందించడం జరిగింది.
అయితే షూటింగ్ సమయంలో నాగార్జున సైతం ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం లేదని డైరెక్ట్ గా దర్శకుడు ముందే అనేవారట.

కానీ ఈ సినిమా మంచి హిట్ ని దక్కించుకుంది. అలానే హలో బ్రదర్ కి సీనియర్ ఎన్టీఆర్ అగ్గి పిడుగుకి కూడా ఒక సంబంధం ఉంది. అదేమిటంటే అగ్గిపిడుగు చిత్రం లో ఎన్టీఆర్ సియామి ట్విన్స్‌గా నటించారు. ఆ సినిమాలో కూడా ఇద్దరు రామారావులు ఉన్నారు.
Also Read: హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో…రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నారు?

ఆ సినిమా కథను ప్రేరణగా తీసుకుని హలో బ్రదర్ తెరకెక్కించారు ఈవివి సత్యనారాయణ. పైగా అగ్గి పిడుగు సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది. సినిమా విడుదలైన తొలి వారం రోజుల్లోనే ఈ చిత్రం ఐదు లక్షలని వసూళ్లు రాబట్టింది.
Also Read: ఇతర హీరోల ఈవెంట్స్‌లో … వారినే “డామినేట్” చేసిన 10 స్టార్ హీరోస్..!




/natural-remedies-for-the-ant-invasion-4868837-20-4d5acb93c6004f8889e88d5f7e1b17e4.jpg?w=1170&ssl=1)


















