బుల్లితెర బాహుబలిగా ఓ ఊపు ఊపిన ‘కార్తీకదీపం’ సీరియల్. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరించిన ఈ సీరియల్ ని ఇటీవలే ముగించేశారు మేకర్స్. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రధారులైన వంటలక్క, డాక్టర్ బాబులతో పాటు వారి పిల్లలుగా యాక్ట్ చేసిన శౌర్య, హిమ కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Video Advertisement

ఇక ఈ సీరియల్ లో సౌర్య గా నటించి మంచి గుర్తింపు పొందింది బేబీ క్రితిక. శౌర్య ‘కార్తీకదీపం’ సీరియల్‌లోనే కాకుండా.. మనసు మమత, బావ మరదళ్లు, గీతాంజలి, అష్టాచెమ్మా, కాంచనమాల, గోపికమ్మ వంటి 15కు పైగా సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా పలు చిత్రాల్లో కూడా నటించింది క్రితిక. అంతేకాకుండా సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉండే క్రితిక యూట్యూబ్ లో పలు వీడియోస్, వెబ్ సిరీస్ లు కూడా చేసి అభిమానులను అలరిస్తోంది.

baby kritika about karthika deepam sequel..!!

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న బేబీ క్రితిక తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి, అలాగే కార్తీక దీపం సీరియల్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ” మా అమ్మ బ్యాంక్ ఉద్యోగి. డాడీ రియల్ ఎస్టేట్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడే నటించడం స్టార్ట్ చేశాను. అలాగే మా నాన్నమ్మ పేరు బేబీ.. అందుకే నా పేరు ముందు బేబీ అని పెట్టుకున్నాను.” అని క్రితిక వెల్లడించింది.

baby kritika about karthika deepam sequel..!!

” కార్తీక దీపం సీరియల్ నటులతో నాకు మంచి బాండింగ్ ఉండేది. నిరుపమ్ అన్న ఎప్పుడూ నన్ను డైరెక్టర్ల దగ్గర ఇరికిస్తాడు. బాగా ఆటపట్టిస్తాడు. కానీ దీప (వంటలక్క) అక్క నాతో బాగుంటారు. ఎక్కువ సీన్లు ఆమెతోనే ఉండేవి. హిమతో అయితే ఎక్కువ గొడవలు అయ్యేవి..సౌందర్య నానమ్మ కూడా నాతో బాగా క్లోజ్‌గా ఉంటారు. మాకోసం చాక్లెట్స్ తెచ్చేవారు. వాళ్ల అబ్బాయి తో కూడా మేం ఆడుకునేవాళ్లం.” అని క్రితిక తెలిపింది.

baby kritika about karthika deepam sequel..!!

ఇక కార్తీక దీపం సీరియల్ కి సీక్వెల్ ఉంటుందా లేదా అన్న విషయం తనకు తెలియదని క్రితిక తెలిపింది. దీనిపై క్లారిటీ మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లే ఇవ్వగలరు. వస్తే బాగుంటుంది. కానీ అందులో మమ్మల్ని తీసుకుంటారో లేదో తెలియదు అని క్రితిక వెల్లడించింది.