ఈ ఫోటో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం కనిపిస్తుంది… కానీ ఇచ్చిన రుణాలే ఉసురు తీశాయి.!

ఈ ఫోటో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం కనిపిస్తుంది… కానీ ఇచ్చిన రుణాలే ఉసురు తీశాయి.!

by Anudeep

Ads

అన్యోన్యమైన దాంపత్యం..భర్తకు మంచి ఉద్యోగం..ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన ఫామిలీ.. ఇంతకు మించి ఏం కావాలి.. కానీ వీరి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.

Video Advertisement

ఉద్యోగం లో భాగంగా అతడు ఇచ్చిన కొన్ని రుణాలే అతడికి యమ పాశాలుగా మారాయి. ఇదే యానాం లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన శ్రీకాంత్ జీవితం.

వివరాల్లోకి వెళ్తే.. టీవీ 9 కథనం ప్రకారం యానాంలో ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న సాయిరత్న శ్రీకాంత్‌.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇంతకు ముందు అతడు మచిలీపట్టణం లో ని ఒక బ్యాంకు లో పని చేసారు. అక్కడ లోన్స్ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం పలువురికి లోన్స్ ఇప్పించాడు. అతడు బ్యాంకు ద్వారా ఇచ్చిన లోన్స్ రికవరీ కాలేదు. దీంతో పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ఈ క్రమంలో తానే అప్పులు చేసి వాటిని చెల్లించాడు. ఆ అప్పులు పెరిగిపోతూ వచ్చాయి. వీటి గురించి మానసిక ఒత్తిడికి లోనైన శ్రీకాంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

మంగళవారం అతని భార్య.. పిల్లల్ని దిగబెట్టి వచ్చేందుకు స్కూల్‌కు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన భార్య.. ఎన్నిసార్లు తలుపుకొట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. కిటికీలోనుంచి చూసేసరికి.. శ్రీకాంత్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే డోర్స్ బద్దలుకొట్టి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పుడే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్దారించారు.

bank manager ends life due to work pressures..
శ్రీకాంత్ యానాంకు ట్రాన్స్‌ఫర్‌పై రాకముందుకు 3 సంవత్సరాలు బందర్ బ్రాంచ్‌లో వర్క్ చేశాడు. ఆ సమయంలో టార్గెట్ మేరకు పలువురికి లోన్స్ ఇచ్చాడు. రుణాలు తీసుకున్నవారు కొందరు యగనామం పెట్టారు. దీంతో శ్రీకాంతే 60 లక్షలు అప్పు చేసి.. ఆ రుణాలు చెల్లించాడు. తర్వాత యానాంకు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చాడు. ఇక్కడ మరో 40 లక్షలు వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగింది. చివరకు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

bank manager ends life due to work pressures..
విధి నిర్వహణలో సమస్యలతో తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని భార్య గాయత్రి పోలీసులకు తెలిపింది. త్వరలోనే తమ సమస్యలు తగ్గుతాయి.. అప్పులు తీర్చి హ్యాపీ గా ఉందాం అని శ్రీకాంత్ తనతో అంటూ ఉండేవారని గాయత్రీ తెలిపారు. ఇంతలోనే ఇలా చేసి తనకు..పిల్లలకు అన్యాయం చేసారని బోరుమని విలపిస్తున్నారు గాయత్రీ. అభం శుభం తెలియని ఆ చిన్నారులను చూస్తే మాత్రం కన్నీరు రాక మానదు.


End of Article

You may also like