IPL నుండి ధోని రిటైర్ అవ్వకుండా… BCCI తీసుకొచ్చిన కొత్త నియమం ఏంటో తెలుసా..?

IPL నుండి ధోని రిటైర్ అవ్వకుండా… BCCI తీసుకొచ్చిన కొత్త నియమం ఏంటో తెలుసా..?

by kavitha

Ads

కెప్టెన్‌గా కూల్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం. లేదు. తాజాగా ఐపీఎల్‌ 16 వ సీజన్ విజేతగా చెన్నై జట్టును నిలబెట్టాడు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ గెలిచిన రోహిత్ కు సమంగా నిలచాడు.

Video Advertisement

ఐపీఎల్‌లో ధోనీకి దక్కిన క్రేజ్ మరో ప్లేయర్ కి దక్కలేదు అని చెప్పవచ్చు.  11 సార్లు ఐపీఎల్ ఫైనల్ కు ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే. చెన్నై జట్టును కెప్టెన్‌గా పదవసారి ఫైనల్ తీసుకెళ్లిన ధోనీ, ఈ సీజన్ లో గెలిచిన తరువాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ గురించి ప్రకటన చేస్తాడని ఎప్పటి నుండో చర్చ జరుగుతోంది. దానికి కారణం ధోనీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడడటం. ఇక ధోనీ కూడా ఈ సీజన్ మొదట్లో చాలా సార్లు రిటైర్మెంట్‌ పై సిగ్నల్స్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గా ధోనీ మాట్లాడుతూ రిటైర్మెంట్ పై నిర్ణయించుకోవడానికి ఇంకా సమయం ఉందని అన్నాడు. 17 వ సీజన్‌కు ముందు రిటైర్మెంట్ పై ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అయితే రాబోయే ఐపీఎల్‌‌ సీజన్ లో ధోనీ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పటిలా ఆడలేకపోయినప్పటికీ, జట్టు కోసం వ్యూహా రచనలో ధోనీ బ్రెయిన్ చురుగ్గా పని చేస్తోంది.అందువల్ల రిటైర్మెంట్ గురించి ధోనికే వదిలేయాలని చెన్నై జట్టు మేనేజ్‌మెంట్ ఎప్పుడో నిర్ణయించుకుంది. నిజానికి ధోనీ ఆడితేనే చెన్నై జట్టు ఫ్రాంచైజీకి ఉపయోగం అని చెప్పవచ్చు. ఇక ధోనీ తన ఐపీఎల్ కెరీర్ ను పొడిగించుకునేలా ఇంపాక్ట్ ప్లేయర్ అనే నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చింది. సాధారణంగా ధోనీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల అదనపు బ్యాట్స్ మెన్ లేక  బౌలర్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా దిగువ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి  వీలవుతోంది.
16 వ సీజన్ లో ఇప్పటి దాకా చెన్నై జట్టు  15 మ్యాచ్‌లు ఆడింది. ధోనీ 62 బంతులను ఆడి 104 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై జట్టులో బాగా ఆడే బ్యాటర్లు ఉన్నారు. అందువల్ల ధోనీకి బ్యాటింగ్‌ చేసే ఛాన్స్ ఎక్కువగా రావడం లేదు. ధోనీ  నుంచి చెన్నై జట్టు ఆశించేది నాయకత్వం, వ్యూహరచన మాత్రమే. ధోనీ బ్యాటర్ గా రాణించలేకపోయినా  ఆ ఫ్రాంచైజీకి అంతగా బాధ లేదు. దీన్ని బట్టి 16 వ సీజన్‌కు ప్రారంభం అయ్యే ముందుగా బీసీసీఐ తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనీని మరి కొన్ని సంవత్సరాలు ఐపీఎల్‌ లో ఆడించడం కోసమే అన్నట్లుగా అనిపిస్తోంది.

Also Read: IPL 2023: విజేతగా నిలిచిన చెన్నై..! ప్రైజ్‌మనీ, అవార్డుల వివరాలు ఇవే..!


End of Article

You may also like