IPL 2023: విజేతగా నిలిచిన చెన్నై..! ప్రైజ్‌మనీ, అవార్డుల వివరాలు ఇవే..!

IPL 2023: విజేతగా నిలిచిన చెన్నై..! ప్రైజ్‌మనీ, అవార్డుల వివరాలు ఇవే..!

by kavitha

Ads

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ 16వ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో మ్యాచ్ లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టు పై విజయం సాధించింది.

Video Advertisement

డెవాన్ కాన్వే 25 బాల్స్ లో 47 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో కెప్టెన్ ధోనీ అత్యధిక ఐపీఎల్ టైటిళ్లను సాధించిన ప్లేయర్స్ లో రోహిత్‌ శర్మను సమం చేశాడు. ఇక ఇతర జట్లు మరియు ప్లేయర్స్ ప్రత్యేక అవార్డులను పొందారు. అయితే ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ ప్రైజ్‌మనీ మొత్తం:
రూ. 46 కోట్ల, 50 లక్షలు

  • విజేతగా నిలిచిన జట్టుకి : రూ. 20 కోట్లు(చెన్నై సూపర్ కింగ్స్)
  • రన్నరప్‌ గా నిలిచిన జట్టుకు: రూ. 13 కోట్లు(గుజరాత్ టైటాన్స్‌)
  • మూడో స్థానంలో ఉన్న జట్టుకి : రూ. 7 కోట్లు (ముంబై ఇండియన్స్‌)
  • నాలుగో స్థానంలో ఉన్న జట్టుకి : రూ. 6 కోట్ల 50 లక్షలు (లక్నో సూపర్‌ జెయింట్స్‌)

ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌) :

శుబ్‌మన్‌ గిల్‌ (17 మ్యాచ్‌లు: 890 పరుగులు) సెంచరీలు: 3, హాఫ్ సెంచరీలు: 4

ఐపీఎల్‌ టోర్నీలో ఆరెంజ్‌ క్యాప్‌ సాధించిన తక్కువ వయస్కుడిగా శుబ్‌మన్‌ గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) రికార్డ్ సృష్టించాడు.

ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు
పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌) :

మొహమ్మద్‌ షమీ (17 మ్యాచ్‌లు: 28 వికెట్లు)

ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు
ఇతర అవార్డులు, ప్రైజ్‌మనీ:

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుబ్‌మన్‌ గిల్‌ (రూ. 10 లక్షలు)

సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆర్సీబీ- రూ. 10 లక్షలు)

గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుబ్‌మన్‌ గిల్‌ (రూ. 10 లక్షలు)

లాంగెస్ట్‌ సిక్స్‌ ఆఫ్‌ ది సీజన్‌ : ఫాఫ్‌ డుప్లెసిస్‌ (రూ. 10 లక్షలు)

క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: రషీద్‌ ఖాన్‌ (రూ. 10 లక్షలు)

సీజన్‌లో అత్యధిక ఫోర్లు: శుబ్‌మన్‌ గిల్‌ (రూ. 10 లక్షలు)

ఫెయిర్‌ ప్లే అవార్డు: ఢిల్లీ క్యాపిటల్స్‌

ఉత్తమ పిచ్‌, గ్రౌండ్‌ ఆఫ్‌ ది సీజన్‌: వాంఖడే స్టేడియం, ఈడెన్‌ గార్డెన్స్‌ (రూ. 50 లక్షలు)

Also Read: పైసా వసూల్ పెర్ఫార్మెన్స్ అంటే వీళ్లదే … IPL 2023 లో తీసుకున్న డబ్బులకు న్యాయం చేసిన 3 ప్లేయర్స్.!


End of Article

You may also like