టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి కప్ ఖాయమనుకుంటే.. సెమీస్‌లో అత్యంత చెత్తగా ఆడి పరువు తీసుకున్నారంటూ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత 9 ఏళ్లుగా టీమిండియాని దరిద్రం వెంటాడుతూనే ఉంది. అప్పటి నుండి ఒక్క కప్ కూడా భారత జట్టు కైవసం చేసుకోలేకపోయింది.

Video Advertisement

అయితే చాలామంది ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, టీ20 వరల్డ్ కప్ గెలిచేవాళ్లమని కామెంట్లు చేస్తున్నారు. అయితే 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనీ కెప్టెన్సీలో టీమిండియా… ఐసీసీ టోర్నీల్లో చాలా వాటిల్లో ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ వైఫల్యాలను జనాలు పట్టించుకోలేదు.

bharat fans fire on KL Rahul..know why..
ముఖ్యంగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఫైనల్ చేరిన ధోనీ సేన, ఆఖరాటలో శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడింది. 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో.. తర్వాత విరాట్ కోహ్లీ సారధ్యం లో 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో..2019 వన్డే వరల్డ్ కప్‌లో2021 టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా… విజయ తీరాలకు అడుగు తీరంలో నిలిచింది.

bharat fans fire on KL Rahul..know why..
తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కూడా టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందించలేకపోయాడు. అయితే దీనికి కారణం కెఎల్ రాహుల్‌ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా కీలకమైన మ్యాచుల్లో ఘోరంగా ఫెయిలైన కేఎల్ రాహుల్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్వు ఐపీఎల్‌కే పరిమితం. ఆరెంజ్ క్యాప్ నీ కోసం ఎదురుచూస్తుంది వెళ్లు. ఇంకెన్నాళ్లు మమ్మల్ని బాధపెడతావ్’’ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

bharat fans fire on KL Rahul..know why..
కెఎల్ రాహుల్ ప్రస్తుతం భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మూడు టైటిల్స్ గెలిచిన ధోనీయే.. రాహుల్ వచ్చాక ఐసీసీ టైటిల్ గెలవలేకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఏం చేయగలరని మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.