బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..??అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదే..?

బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..??అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదే..?

by Anudeep

Ads

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఆరో సీజన్ ఎంతో ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు. ఇందులో అంతకు ముందెన్నడూ చూడని కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, ఈ సీజన్ కి మాత్రం అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు. దీంతో రేటింగ్స్ మరీ దారుణం గా వస్తున్నాయన్నది అందరికి తెలిసిందే.

Video Advertisement

బిగ్ బాస్ ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. కొందరు కంటెస్టెంట్లు పాత గొడవలను మనసులో పెట్టుకుని ఆ పాయింట్లతో గొడవలకు దిగారు. ఇలా ఈ టాస్కులో మొత్తం ఇనాయ సుల్తానా, మెరీనా, బాలాదిత్య, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, ఆది రెడ్డి, సుదీప పింకీ, గీతూ రాయల్‌లు ఆరో వారానికి నామినేట్ అయ్యారు.

bigboss season 6 elimination details..
గత కొన్ని వారాలుగా హౌస్ లో ఉండడానికి అర్హత లేని వారు నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి కొద్దిగా క్రేజ్ ఉండి.. బాగా ఆడి, ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. నేహా చౌదరి విషయంలో అదే జరిగింది, రీసెంట్ గా చంటి విషయంలో అలానే జరిగింది. రాజ్, వాసంతి, సుదీప లాంటి వాళ్ళు హౌస్ లో ఉన్నారు. వీరికి గేమ్ రాదు, ఎంటర్టైన్మెంట్ తెలియదు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో శ్రీహన్ ఓటింగ్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా.. రెండు వారాలుగా గట్టిపోటీ ఇస్తున్న కీర్తి సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది. తర్వాత అనూహ్యంగా ఆదిరెడ్డి తన ఓటింగ్ ని పెంచుకుని మూడో స్థానంలోకి వచ్చేసాడు.

bigboss season 6 elimination details..
ఆ తర్వాత స్థానంలో గీతు ఉండగా.. తర్వాత ప్లేస్ లో మరీనా ఉంది. ఆరో స్థానాల్లో రాజ్ ఉండగా.. ఏదో స్థానంలో బాలాదిత్య, ఎనిమిదో స్థానంలో శ్రీసత్య ఉన్నారు. మొన్నటి వరకు శ్రీసత్య టాప్ 5 లోనే కొనసాగింది. కానీ ఆమె కి ఓటింగ్ శాతం బాగా తగ్గడంతో డేంజర్ జోన్ లోకి వచ్చేసింది.

bigboss season 6 elimination details..

ఇక ఎప్పటిలాగే అంటే గత నాలుగు వారాలుగా చివరి స్థానంలోనే కొనసాగుతూ.. ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటున్న సుదీప ఉంది. దీంతో ఈమె ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెకు సంబంధించిన వీడియో రెడీ గా ఉన్నట్లు సమాచారం.

bigboss season 6 elimination details..

ఈ సీజన్‌లో హౌస్ లోకి శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటిలు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు.


End of Article

You may also like